విశాలాంధ్ర ధర్మవరం;; భగత్ సింగ్ ఆశయాలను ముందుకు తీసుకుని వెళ్లాలని సిపిఎం నాయకులు తెలిపారు. ఈ సందర్భంగా వారు
భగత్ సింగ్ 119వ జయంతి పట్టణంలోని సీపీఎం కార్యాలయంలో ఘనంగా నిర్వహిస్తూ, భగత్ సింగ్ చిత్రపటానికి సీపీఎం నాయకులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం నాయకులు మాట్లాడుతూ.. భగత్ సింగ్ దేశ స్వాతంత్ర్యం కోసం చిన్న వయసులోనే బ్రిటిష్ వలస పాలనకు వ్యతిరేకంగా పోరాడిన గొప్ప విప్లవ యోధుడని అన్నారు. సమాజంలో దోపిడీ, అసమానతలు తొలగిపోయి ప్రతి ఒక్కరికీ సమాన హక్కులు, సామాజిక న్యాయం అందాలని ఆయన కలలు కన్నారని తెలిపారు. నేటి యువత భగత్ సింగ్ జీవితాన్ని, ఆయన ఆలోచనలను స్ఫూర్తిగా తీసుకుని ప్రజా సమస్యలపై చైతన్యంతో ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. విద్య, ఉపాధి, సామాజిక న్యాయం కోసం యువత ఐక్యంగా పోరాడాలని అన్నారు. ఈ కార్యక్రమంలో సీపీఎం సీనియర్ నాయకులు ఎస్ హెచ్ భాష, పట్టణ కార్యదర్శి మారుతి ,సిఐటియు నాయకులు ఆదినారాయణ చేనేత కార్మిక సంఘం జిల్లా కన్వీనర్ జెవి రమణ ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి నామాల నాగార్జున నాయకులు పాల్గొన్నారు.
భగత్ సింగ్ ఆశయాలను ముందుకు తీసుకెళ్లాలి
- Advertisement -
RELATED ARTICLES


