విశాలాంధ్ర ధర్మవరం; పట్టణంలోని ప్రభుత్వ బాలుర జూనియర్ కళాశాల, ధర్మవరంలో ఖాళీగా ఉన్న యం.ఎల్.టి. కోర్సుకు సంబంధించి అతిథి అధ్యాపక పోస్టు భర్తీ చేయుటకు స్పాట్ డెమో ఇంటర్వ్యూను ఆగస్టు 12వ తేదీ బుధవారం ఉదయం 10 గంటలకు నిర్వహిస్తున్నట్లు ప్రిన్సిపాల్ ప్రశాంతి తెలిపారు. అనంతరం వారు మాట్లాడుతూ ఆగస్టు 11వ తేదీన దరఖాస్తు చేసుకొని 12వ తేదీన ఇంటర్వ్యూకు రావాలని తెలిపారు.
సంబంధిత సబ్జెక్టు బయోకెమిస్ట్రీ లో *పోస్ట్ గ్రాడ్యుయేషన్ (పిజీ.)లో కనీసం 50 శాతముమార్కులు కలిగి ఉండాలి అని తెలిపారు..అర్హత కలిగిన అభ్యర్థులు తమ విద్యార్హతలు, అనుభవం,ఇతర సంబంధిత సర్టిఫికెట్ల ఒరిజినల్స్‌తో నేరుగా కళాశాలకు హాజరై స్పాట్ డెమో ఇంటర్వ్యూలో పాల్గొనవలసిందిగా తెలిపారు. మరిన్ని వివరాలకు సంప్రదించవలసిన ఫోన్ నంబర్: 9490441588 కు సంప్రదించాలన్నారు.
అతిథి అధ్యాపక పోస్టుకు స్పాట్ డెమో & ఇంటర్వ్యూల నిర్వహణ… ప్రిన్సిపాల్ ప్రశాంతి
- Advertisement -
RELATED ARTICLES


