Homeజిల్లాలుఅనంతపురంనార్పలలో వికసిత్ భారత్ అవగాహన కార్యక్రమం…

నార్పలలో వికసిత్ భారత్ అవగాహన కార్యక్రమం…

- Advertisement -

విశాలాంధ్ర-నార్పల (అనంతపురం జిల్లా) : మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయంలో వికసిత్ భారత్ జీ రామ్ జీ అవగాహన కార్యక్రమాన్ని మంగళవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీడీవో మమతాదేవి మాట్లాడుతూ ప్రభుత్వ అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ పథకాలపై అధికారులు, సిబ్బంది పూర్తి అవగాహన కలిగి ఉండాలని సూచించారు. ఆయా పథకాల ప్రయోజనాలు అర్హులైన ప్రతి ఒక్కరికీ అందేలా క్షేత్రస్థాయిలో సమర్థవంతంగా పనిచేయాలని పేర్కొన్నారు.గ్రామీణ ప్రాంతాల్లో ప్రభుత్వ పథకాల అమలు, ప్రజలకు అందుతున్న సేవలు తదితర అంశాలపై కార్యక్రమంలో అవగాహన కల్పించారు. సంబంధిత శాఖల అధికారులు, సిబ్బంది సమన్వయంతో పనిచేస్తే ప్రభుత్వ లక్ష్యాలను మరింత సమర్థవంతంగా సాధించవచ్చని ఎంపీడీవో మమతాదేవి తెలిపారు.ఈ కార్యక్రమంలో డిప్యూటీ ఎంపీడీవో శ్యామల, ఏపీఓ రమేష్ రామారావు, మేజర్ పంచాయతీ కార్యదర్శి శ్రీనివాసులు, పంచాయతీల ప్రత్యేక అధికారులు, గ్రామ కార్యదర్శులు, ఉపాధి హామీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు