విశాలాంధ్ర, ఉరవకొండ (అనంతపురం జిల్లా) : అనంతపురం జిల్లాలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన పెన్నాహోబిలం శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానానికి చెందిన కలగలుపు బియ్యం, కొబ్బరి చిప్పల వేలంపాటలను మంగళవారం ఆలయ ఆవరణలో నిర్వహించారు.కలగలుపు బియ్యం వేలంలో కిలో రూ.25 చొప్పున నాగశేషు అనే వ్యక్తి వేలం దక్కించుకున్నారు. అయితే కొబ్బరి చిప్పలకు ఆశించిన ధర రాకపోవడంతో వేలంపాటను వాయిదా వేశారు. గత ఏడాది కొబ్బరి చిప్పల వేలం రూ.6.85 లక్షలకు దక్కింది. ఈ ఏడాది ఆగస్టు 13న నిర్వహించిన వేలంలో ప్రొద్దుటూరుకు చెందిన ప్రసాద్ రూ.15.10 లక్షలకు వేలం పాడారు. ఆయన రూ.లక్ష డిపాజిట్ చెల్లించినప్పటికీ అనంతరం మిగిలిన మొత్తాన్ని దేవాలయానికి చెల్లించకుండా అధికారులకు అందుబాటులో లేకుండా పోయారు.
దీంతో అధికారులు ఆ వేలంపాటను రద్దు చేసి మంగళవారం తిరిగి వేలం నిర్వహించారు. అయితే సరైన ధర రాకపోవడంతో కొబ్బరి చిప్పల వేలాన్ని మరోసారి నిర్వహించనున్నట్లు ఆలయ కార్యనిర్వహణ అధికారి రమేష్‌బాబు తెలిపారు. ఉండబండ దేవాలయ కార్యనిర్వహణ అధికారి విజయ్ కుమార్ పర్యవేక్షణలో వేలంపాటలు జరిగాయి. కార్యక్రమంలో ఆలయ ధర్మకర్తల మండలి సభ్యులు, సిబ్బంది పాల్గొన్నారు.
బియ్యం వేలం పూర్తి.. కొబ్బరి చిప్పల వేలం వాయిదా
- Advertisement -


