- Advertisement -
అనంతపురం జిల్లా, విశాలాంధ్ర-తాడిపత్రి: పట్టణంలోని నందలపాడు టు అంగన్వాడి కేంద్రంలో సోమవారం అంగన్వాడి వర్కర్ శంకరమ్మ ఆధ్వర్యంలో పోషక వారోత్సవాల కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఐసిడిఎస్ సూపర్వైజర్ లావణ్య పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పోషణ వారోత్సవాల గురించి వైటనింగ్ బి12, పోలింగ్ యాసిడ్, బ్యాలెన్స్ డైట్, అంగన్వాడి సేవలపై గర్భని, బాలింతలకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో పిల్లలు, గర్భవతులు, బాలింతలు అంగన్వాడి కార్యకర్తలు పాల్గొన్నారు.


