Homeజిల్లాలుకర్నూలుఘనంగా భగత్ సింగ్ జయంతి వేడుకలు

ఘనంగా భగత్ సింగ్ జయంతి వేడుకలు

- Advertisement -

విశాలాంధ్ర – పెద్దకడబూరు (కర్నూలు) : మండల కేంద్రమైన పెద్దకడబూరులోని స్థానిక సిపిఐ కార్యాలయంలో అఖిల భారత విద్యార్థి సమాఖ్య ఆధ్వర్యంలో సోమవారం భగత్ సింగ్ 119వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా భగత్ సింగ్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం ఏఐవైఎఫ్ తాలూకా అధ్యక్షులు జాఫర్ పటేల్ మాట్లాడుతూ భగత్ సింగ్ దేశంలో ఉన్న యువతకు స్పూర్తి అన్నారు. దేశ భవిష్యత్తు కోసం 13 సంవత్సరాల వయస్సులోనే ఆలోచించిన మేధావి, దేశ స్వాతంత్య్రం కోసం ఉరి కొయ్యల చెరసాలను ముద్దాడిన యువకిశోరం భగత్ సింగ్ అని కొనియాడారు. భయపడే ఆలోచనలు నీ మెదడులోకి రానివ్వకు, అవే నిన్ను పిరికివాడిని చేస్తాయన్నారు. ఆయన ఆశయాలను సాధించడానికి నేటి యువత ముందుకు రావాలని పిలుపునిచ్చారు. కేంద్ర ప్రభుత్వం అవలంభిస్తున్న యువజన వ్యతిరేక విధానాలను తిప్పి కొట్టి యువకుల హక్కులను సాధించుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో ఏఐవైఎఫ్ మండల అధ్యక్షులు షేక్ మహ్మద్ హుస్సేన్, నాయకులు ఇర్ఫాన్, తిక్కన్న, రామాంజనేయులు, విద్యార్థులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు