Homeజిల్లాలుఅనంతపురంఉరవకొండ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఘనంగా గుర్రం జాషువా జయంతి

ఉరవకొండ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఘనంగా గుర్రం జాషువా జయంతి

- Advertisement -

విశాలాంధ్ర, ఉరవకొండ (అనంతపురం జిల్లా) : : ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ప్రముఖ కవి, సామాజిక చైతన్యవాది గుర్రం జాషువా జయంతిని సోమవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జాషువా చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు.ప్రిన్సిపల్ డాక్టర్ శైలజారాణి మాట్లాడుతూ జాషువా తన కవిత్వంతో కుల వివక్ష, అంటరానితనం,సామాజిక అసమానతలను ప్రశ్నించారని తెలిపారు. ఆయన రచనలు మానవతా విలువలు, సమానత్వ భావనకు ప్రాధాన్యతనిచ్చాయని పేర్కొన్నారు. వైస్‌ ప్రిన్సిపల్ పి. సోమశేఖర్ జాషువా కవిత్వం ప్రజల జీవితాలను ప్రతిబింబించిందన్నారు.ఆంగ్ల అధ్యాపకులు నారాయణస్వామి జాషువా పద్యాలను వివరించారు. జంతుశాస్త్ర అధ్యాపకురాలు జమీల బీబీ మాట్లాడుతూ మహాకవుల జీవితాలను ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు. తెలుగు అధ్యాపకురాలు రేణుకాదేవి జాషువా జీవితం, సాహిత్య ప్రస్థానాన్ని విద్యార్థులకు వివరించారు.
విద్యార్థులు జాషువా పద్యాలను పఠించి ఆయన సాహిత్య విశిష్టతను స్మరించుకున్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు