Homeజిల్లాలుకర్నూలుప్రాథమిక పాఠశాల చైర్మన్ గా గణేష్ నాయుడు

ప్రాథమిక పాఠశాల చైర్మన్ గా గణేష్ నాయుడు

- Advertisement -

విశాలాంధ్ర – పెద్దకడబూరు (కర్నూలు) : మండల కేంద్రమైన పెద్దకడబూరులోని స్థానిక ప్రాథమిక పాఠశాలలో మంగళవారం జరిగిన పాఠశాల యాజమాన్య కమిటీ ఎన్నికల్లో పాఠశాల యాజమాన్య కమిటీ చైర్మన్ గా దుర్గయ్య గారి గణేష్ నాయుడును ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. తెలుగుదేశం పార్టీ బలపరిచిన గణేష్ నాయుడును విద్యార్థుల తల్లిదండ్రులు చేతులు పైకెత్తి ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పాఠశాల యాజమాన్య కమిటీ చైర్మన్ గా తనను ఎన్నుకుందుకు కృతజ్ఞతలు తెలిపారు. పాఠశాల అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షులు ఆంజనేయ, టిడిపి మండల ప్రధాన కార్యదర్శి మొట్రు రామాంజనేయులు, యూనిట్ ఇంచార్జీ తలారి అంజి, నాయకులు ఈరన్న, శాంతమూర్తి, రామాంజనేయులు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు