Homeజిల్లాలుశ్రీ సత్యసాయినేతన్న సేవ పథకం లో జరిగిన అవినీతి అక్రమాలపై నిగ్గు తేల్చలి

నేతన్న సేవ పథకం లో జరిగిన అవినీతి అక్రమాలపై నిగ్గు తేల్చలి

- Advertisement -

పట్టణ కదిరి రైల్వే గేట్ వద్ద చేనేత కార్మికులు రోడ్డుపై ధర్నా

పోలీసులు, హ్యాండ్లూమ్ అధికారులు హామీతో సమ్మె విరమణ

ఏపీ చేనేత కార్మిక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు వెంకటనారాయణ
విశాలాంధ్ర ధర్మవరం;; రాష్ట్రవ్యాప్తంగా చేనేత కార్మికుల యొక్క సమస్యలు ప్రభుత్వాలు పరిష్కరించకపోవడంతో, నేతన్న నేస్తం లో జరిగిన అవకతవకలపై వందలాది మంది చేనేత కార్మికులు పట్టణంలోని కదిరి రైల్వే గేట్ వద్ద ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ ధర్నా కార్యక్రమం కొన్ని గంటల పాటు నిర్వహించారు. అనంతరం పోలీసులు హ్యాండ్లూమ్ అధికారులను హుటాహుటిన పిలిపించి వారి ద్వారా ఐదు రోజులలో సమస్య పరిష్కరిస్తామని హామీ ఇవ్వడంతో సమ్మె విరమించారు. అనంతరం ఏపీ చేనేత కార్మిక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు వెంకటనారాయణ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం చేనేత కార్మికులను ఆదుకునేందుకు ప్రతిష్టాత్మకంగా చేపట్టిన నేతన్నసేవ పథకంలో జరిగిన అవినీతి అక్రమాలపై నిగ్గు తేల్చాలని వారు డిమాండ్ చేశారు. చేనేత కార్మికులను ఆదుకునేందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఆగష్టు 7 వ తేదిన అమలు చేసారు కానీ ఆ పథకం లో సచివాలయం సిబ్బంది చేతి వాటం తో అర్హులైన చేనేత కార్మికులకు కాకుండా ఇతరులకు నేతన్న సేవ పథకం డబ్బులు జమ అయ్యేవిధంగా చేశారని వారు మండిపడ్డారు. చేనేత కార్మికుల కదిరి గేటు వద్ద నేతన్న విగ్రహం దగ్గర చేనేత కార్మికులు ధర్నా నిర్వహిస్తూ మా బాధను వ్యక్తం చేశామని తెలిపారు. జిల్లా వ్యాప్తంగా ఉన్న అన్ని సచివాలయాలలో ఐఏఎస్ అధికారులతో విచారణ జరిపించి చేనేత కార్మికులకు న్యాయం చేయాలని తెలిపారు. ఆగస్టు 11వ తేదీ మంగళవారం ఉదయం 10 గంటలకు ఆర్డీవో ఆఫీస్ దగ్గర అర్హులైన చేనేత కార్మికులకు నేతన్న సేవ పథకం 25 వేల రూపాయలు వెంటనే బ్యాంకు ఖాతాలలో జమ చేయాలని ధర్నాకు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో చేనేత నాయకులు గుర్రం వెంకటస్వామి, రవి కుమార్, రమణ, పెద్ద ఎత్తున చేనేత కార్మికులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు