Homeజిల్లాలుఅనకాపల్లిసుస్థిరమైన అభివృద్ధికి తల్లి పాల సంస్కృతిని ప్రోత్సహిద్దాం

సుస్థిరమైన అభివృద్ధికి తల్లి పాల సంస్కృతిని ప్రోత్సహిద్దాం

- Advertisement -

విశాలాంధ్ర -అనకాపల్లి: స్థానిక బి.ఆర్ దాసు వీధి లో గల అంగన్వాడీ కేంద్రం-2 లో నిర్వహించిన ప్రపంచ తల్లిపాల వారోత్సవాల సందర్భంగా తల్లిపాల ప్రాముఖ్యతపై అవగాహనా కార్యక్రమం మహిళాభివృద్ధి శిశు సంక్షేమ శాఖ ప్రాజెక్టు డెరైక్టర్ శ్రీమతి ఎన్ సూర్య లక్ష్మి అధ్యక్షతన గురువారం జరిగింది.
మహిళా కమిషన్ సభ్యురాలు శ్రీమతి గెడ్డం ఉమ,తల్లిపాలు శిశువుకు సంపూర్ణ పోషకాహారం అని, పుట్టిన గంటలోపే తల్లిపాలు పట్టించడం ఎంతో అవసరమని తెలిపారు. తొలి ఆరు నెలలు శిశువుకు తల్లిపాలు మాత్రమే ఇవ్వాలని, అనంతరం తల్లిపాలతో పాటు పౌష్టికాహారాన్ని అందించాలని సూచించారు.
తల్లిపాలు శిశువుకు రోగనిరోధక శక్తిని పెంచడంతో పాటు తల్లి ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తాయని పేర్కొన్నారు. ప్రతి తల్లి తల్లిపాల ప్రాముఖ్యతను తెలుసుకొని శిశువుకు తప్పనిసరిగా తల్లిపాలు అందించాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో సీడీపీఓ ఎం.వి. రమణ కుమారి, ఏసీడీపీఓ టి. శశికళ,
అంగన్‌వాడీ కార్యకర్తలు, వైద్య సిబ్బంది, గర్భిణీలు, బాలింతలు , స్థానికులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు