అనకాపల్లి: ఉత్తరాంధ్ర జిల్లాల్లోనే విద్యా రంగంలో విశేష పేరుప్రఖ్యాతులు గాంచిన అనకాపల్లి ఏ.ఎం.ఏ.ఎల్. (AMAL) డిగ్రీ కళాశాలలో ఈ విద్యా సంవత్సరం నుండి కొత్తగా ‘బీ.కాం. కంప్యూటర్స్’ కోర్సు అందుబాటులోకి రానుంది. వర్తమాన ఉద్యోగ, ఉపాధి రంగాల్లో తీవ్ర డిమాండ్ ఉన్న ఈ కోర్సును ఉన్నత విద్యాశాఖ ద్వారా కళాశాలకు మంజూరు చేసినట్లు ప్రిన్సిపాల్ బొత్స సత్యానంద సాగర్ గురువారం ఒక ప్రకటనలో వెల్లడించారు.
నాలుగేళ్ల హానర్స్ చదివే అవకాశం
గత కొన్ని సంవత్సరాలుగా విద్యార్థులు, తల్లిదండ్రుల నుండి వస్తున్న విజ్ఞప్తులను పరిశీలించిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉన్నత విద్యాశాఖ అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రిన్సిపాల్ తెలిపారు. విద్యార్థులు మూడేళ్ల సాధారణ డిగ్రీతో పాటు, ఆసక్తి ఉన్నవారు నాలుగేళ్ల ‘బీ.కాం. హానర్స్ (కంప్యూటర్స్)’ కోర్సును కూడా అభ్యసించే వినూత్న అవకాశాన్ని కల్పిస్తున్నామన్నారు.
ప్రథమ విడతగా 50 సీట్లతో ఈ విద్యా సంవత్సరం నుంచే ప్రవేశాలు ప్రారంభమవుతాయని తెలిపారు. అనకాపల్లి వర్తక సంఘం కళాశాలను ఎటువంటి లాభాపేక్ష లేకుండా సేవాభావంతో నిర్వహిస్తోంది. అందువల్ల ప్రభుత్వం నిర్ణయించిన సాధారణ ఫీజులకే అడ్మిషన్లు లభిస్తాయి అని తెలిపారు.ఇంటర్మీడియట్ పూర్తి చేసిన విద్యార్థులు ఈ కోర్సు కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.
_అత్యాధునిక సదుపాయాలు
కోర్సుకు తగినట్లుగా అత్యాధునిక సాంకేతికతతో కూడిన కంప్యూటర్ ల్యాబ్‌ను ఇప్పటికే సిద్ధం చేశామని కళాశాల యాజమాన్యం స్పష్టం చేసింది. దూర ప్రాంతాల నుండి వచ్చే విద్యార్థుల కోసం హాస్టల్ సౌకర్యంతో పాటు సుసజ్జితమైన గ్రంథాలయం (లైబ్రరీ), ఎన్.సి.సి (NCC), ఎన్.ఎస్.ఎస్ (NSS), క్రీడలు (Sports) వంటి అన్ని రకాల సదుపాయాలు అందుబాటులో ఉన్నాయని తెలిపారు.
ప్రవేశాల కోసం సంప్రదించండి:
ఈ కోర్సుపై ఆసక్తి ఉన్న విద్యార్థులు, తల్లిదండ్రులు పూర్తి వివరాల కోసం కళాశాల పని వేళల్లో నేరుగా వచ్చి సంప్రదించవచ్చని లేదా 9030640246 ఫోన్ నంబర్‌ను సంప్రదించి సమాచారం తెలుసుకోవచ్చని ప్రిన్సిపాల్ తెలియజేశారు.


