Homeజిల్లాలుఅనంతపురంప్రతి రైతు కూడా వాతావరణ భీమా పథకాన్ని వినియోగించుకోవాలి

ప్రతి రైతు కూడా వాతావరణ భీమా పథకాన్ని వినియోగించుకోవాలి

- Advertisement -

జిల్లా ఉద్యాన శాఖ అధికారి ఉమాదేవి
విశాలాంధ్ర అనంతపురం టౌన్ : జిల్లాలోని ప్రతి ఉద్యాన రైతు కూడా వాతావరణ భీమా పథకాన్ని వినియోగించుకోవాలని జిల్లా ఉద్యాన శాఖ అధికారి ఉమాదేవి పేర్కొన్నారు. క్రాప్ ఇన్సూరెన్స్ స్కీమ్ లో ఐదు ఉద్యాన పంటలు కవర్ అవుతున్నాయని, రైతులందరూ ఈ అవకాశాన్ని వినియోగించుకొని బీమా ప్రీమియం కట్టాలని కోరుతున్నామన్నారు. ఎండుమిరపకి ఇన్సూరెన్స్ ఉందని, తర్వాత వెదర్ బేస్డ్ ఇన్సూరెన్స్ కింద మనకి దానిమ్మ, బత్తాయి, అరటి, టమాటా ఈ నాలుగు పంటలకి వాతావరణ బీమా పథకము అమలవుతోందన్నారు. దయచేసి ప్రతి రైతు ప్రీమియం కట్టాలని, ఇంకా రెండు రోజులు మాత్రమే సమయం ఉందని, ఈనెల 31లోపు బీమా ప్రీమియం కట్టాలని కోరారు. దానిమ్మకు చూస్తే ప్రీమియం రూ. 3,750 ఒక ఎకరాకి, అలానే బత్తాయికి రూ. 2,750, టమాటాకి రూ.1,600 అని, అరటికి రూ. 3,000 ఒక ఎకరాకి ప్రీమియం చెల్లించాలన్నారు. ఎందుకంటే ఈ ఏడాది మనకి వాతావరణ పరిస్థితులు ప్రతికూలంగా ఉన్నాయని, ఇప్పటిదాకా పడాల్సిన వర్షపాతం కూడా పడలేదని, ప్రతి రైతు కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరారు. వర్షపాతం, రిలేటివ్ హ్యూమిడిటీ, టెంపరేచర్ ఈ మూడు కండిషన్స్ లో ఏదైనా అడ్వర్స్ గా ఉందంటే మాత్రం ఇన్సూరెన్స్ క్లైమ్ రావడానికి అవకాశం ఉందన్నారు. ఈ సంవత్సరం ప్రతికూల వాతావరణం ఉంది కాబట్టి ప్రతి రైతు కూడా ఈ వాతావరణ భీమా పథకాన్ని వినియోగించుకోవాలని కోరుతున్నామన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు