Homeజిల్లాలుఅనంతపురండీఎస్సీ-2025 అవకతవకలపై రెండో రోజు రిలే నిరాహార దీక్షలు

డీఎస్సీ-2025 అవకతవకలపై రెండో రోజు రిలే నిరాహార దీక్షలు

- Advertisement -

విశాలాంధ్ర, ఉరవకొండ (నంతపురం జిల్లా) : డీఎస్సీ-2025 నియామకాల్లో జరిగినట్లు ఆరోపిస్తున్న అవకతవకలపై సమగ్ర విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తూ ఉరవకొండలో వైఎస్ఆర్‌సీపీ విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో చేపట్టిన రిలే నిరాహార దీక్షలు శుక్రవారం రెండో రోజు కొనసాగాయి. ఈ సందర్భంగా వైఎస్ఆర్‌సీపీ రాయలసీమ ప్రతినిధి కె.వి.రమణ మాట్లాడుతూ.. డీఎస్సీ వ్యవహారంలో అవకతవకలకు బాధ్యత వహిస్తూ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.డీఎస్సీలో ఒక్కో పోస్టును రూ.20 లక్షల వరకు అమ్ముకున్నారనే ఆరోపణలు వస్తున్నాయని, వాటిపై ప్రభుత్వం సమగ్ర విచారణ జరిపి వాస్తవాలను ప్రజల ముందుంచాలని కోరారు. డీఎస్సీ అభ్యర్థుల అనుమానాలను నివృత్తి చేసేందుకు నారా లోకేష్ నేరుగా అభ్యర్థులతో చర్చలకు సిద్ధం కావాలని అన్నారు. నియామక ప్రక్రియలో పారదర్శకత, మెరిట్‌కు ప్రాధాన్యం కల్పించాలని డిమాండ్ చేశారు. ఉద్యోగాల కోసం సంవత్సరాల తరబడి కష్టపడి చదివిన నిరుద్యోగ యువతకు అన్యాయం జరిగితే చూస్తూ ఊరుకునేది లేదని రమణ హెచ్చరించారు. అభ్యర్థుల ఆందోళనలను ప్రభుత్వం సానుకూలంగా పరిగణించి, వారి డిమాండ్లపై స్పష్టమైన హామీ ఇవ్వాలని కోరారు. రాష్ట్రంలో అరాచక పాలన కొనసాగుతోందని, తమ హక్కుల కోసం శాంతియుతంగా ఆందోళనలు చేస్తున్న వారిపై అక్రమ కేసులు బనాయిస్తున్నారని ఆరోపించారు. డీఎస్సీ-2025 నియామకాల్లో తలెత్తిన అన్ని అనుమానాలను నివృత్తి చేసేందుకు నిష్పక్షపాతంగా దర్యాప్తు చేపట్టాలని, అవసరమైతే సీబీఐతో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. అభ్యర్థులకు న్యాయం జరిగే వరకు రిలే నిరాహార దీక్షలను కొనసాగిస్తామని నాయకులు తెలిపారు. కార్యక్రమంలో వైఎస్ఆర్‌సీపీ విద్యార్థి విభాగం నాయకులు, వైసీపీ నాయకులు బసవరాజు, ఈడిగ ప్రసాద్, సుశీలమ్మ, మాజీ జెడ్పిటిసి తిప్పయ్య, జగదీష్,గోవిందు, విద్యార్థి సంఘాల, డీఎస్సీ అభ్యర్థులు, పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు