Homeజిల్లాలుఅనకాపల్లిఐటీఐ రెండో విడత ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం

ఐటీఐ రెండో విడత ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం

- Advertisement -

​విశాలాంధ్ర_అనకాపల్లి: అనకాపల్లి జిల్లాలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు ఐటీఐ కళాశాలల్లో 2026-2027 విద్యాసంవత్సరానికి గాను మిగిలి ఉన్న సీట్ల భర్తీకి 2వ విడత ప్రవేశాల కొరకు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు జిల్లా కన్వీనర్ ప్రభుత్వ ఐటీఐ ప్రిన్సిపాల్ ఎస్. గౌరీశంకర్ ఒక ప్రకటనలో తెలిపారు. జూలై 22, 2026 నుండి ఆగస్టు 03, 2026 రాత్రి 11:59 గంటల వరకు అధికారిక వెబ్‌సైట్ iti.ap.gov.in లో దరఖాస్తు చేసుకోవచ్చు అని తెలిపారు.​ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకున్న కొత్త విద్యార్థులు ఆగస్టు 04, 2026 లోపు సమీపంలోని ప్రభుత్వ ఐటీఐ కళాశాలలో సర్టిఫికేట్ వెరిఫికేషన్ పూర్తి చేసుకోవాలన్నారు.​వెరిఫికేషన్ పూర్తయిన విద్యార్థులు , మొదటి ఫేజ్‌లో సీటు రాని అభ్యర్థులు ఆగస్టు 06, 2026 వరకు ప్రభుత్వ ఐటీఐల కొరకు ఆప్షన్లు నమోదు చేసుకోవచ్చు అన్నారు.​ప్రైవేటు ఐటీఐల కొరకు ఆగస్టు 08, 2026 వరకు ఆప్షన్లు ఇచ్చుకునే అవకాశం కల్పించినట్లు తెలిపారు.ఏదైనా ఐటీఐలో ఇప్పటికే ప్రవేశం పొందిన విద్యార్థులు మరో ఐటీఐ లేదా ట్రేడ్‌కు మారాలనుకుంటే, వారు కూడా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకుని వెరిఫికేషన్ పూర్తి చేసుకోవాల్సి ఉంటుందన్నారు.
​మరిన్ని వివరాలు , సందేహాల నివృత్తి కోసం క్రింది నంబర్లలో సంప్రదించవచ్చు అని గౌరీ శంకర్ ప్రకటనలో పేర్కొన్నారు.
9618322824, 8885887333, 9491987334, 8977272231

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు