Homeజిల్లాలుఅనంతపురంఅర్హులైన ఓటర్లను జాబితా నుంచి తొలగించొద్దు: సాకే శైలజానాథ్, సత్యనారాయణ రెడ్డి…

అర్హులైన ఓటర్లను జాబితా నుంచి తొలగించొద్దు: సాకే శైలజానాథ్, సత్యనారాయణ రెడ్డి…

- Advertisement -

విశాలాంధ్ర- నార్పల (అనంతపురం జిల్లా ) : అర్హులైన ఓటర్ల పేర్లు ఓటరు జాబితా నుంచి తొలగించకుండా అధికారులు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని మాజీ మంత్రి డాక్టర్ సాకే శైలజానాథ్, నార్పల సత్యనారాయణ రెడ్డి కోరారు. 2002 నాటి ఓటరు జాబితాలోని వివరాలు, ప్రస్తుతం ఉన్న ఓటరు కార్డుల వివరాల్లో తేడాలు ఉన్న నేపథ్యంలో పలువురు ఓటర్లకు బీఎల్‌వోలు నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే.మంగళవారం నార్పల తహసీల్దార్ కార్యాలయంలో తహసీల్దార్ అరుణకుమారిని కలిసి సాకే శైలజానాథ్, సత్యనారాయణ రెడ్డి ఈ విషయంపై చర్చించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, నోటీసులు అందుకున్న ఓటర్లు పాత, ప్రస్తుత ఓటరు కార్డులతో పాటు అవసరమైన ఆధార పత్రాలను సమర్పిస్తున్నప్పటికీ వాటి పరిశీలనలో నిర్లక్ష్యం చోటుచేసుకుంటోందని ఆందోళన వ్యక్తం చేశారు. అర్హత కలిగిన ఏ ఒక్క ఓటరు కూడా తన ఓటు హక్కును కోల్పోకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని కోరారు.ఓటరు జాబితాలో పేర్ల చేర్పులు, తొలగింపుల ప్రక్రియ పూర్తిగా పారదర్శకంగా సాగాలని, క్షేత్రస్థాయిలో బీఎల్‌వోలు అందుబాటులో ఉండి ఓటర్లు సమర్పించే ఫారాలు, ఆధారాలను సక్రమంగా పరిశీలించాలని సూచించారు. ఎన్నికల ప్రక్రియలో అధికారులు పార్టీలకు అతీతంగా, నిష్పక్షపాతంగా వ్యవహరించి అర్హులైన ప్రతి ఓటరి హక్కును పరిరక్షించేలా చర్యలు చేపట్టాలని కోరారు.ఈ సమావేశంలో మండల కన్వీనర్ ఖాదర్ వలి ఖాన్, బీసీ సెల్ నియోజకవర్గ నాయకుడు ఫణీంద్ర, మండల యువజన విభాగం అధ్యక్షులు పాటిల్ దివాకర్, అశోక్, మన్నిలా శివయ్య, విద్యార్థి విభాగం జిల్లా కార్యదర్శులు మహేష్ నాయక్, హరికృష్ణ, జిల్లా యువజన విభాగం కార్యదర్శులు సోహెల్, సాయి, ఎస్సీ సెల్ అధ్యక్షుడు ప్రభుదాస్, నౌషాద్ వెంకటనారాయణ రెడ్డి పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు