గాలిబాఫ్ హెచ్చరిక
తెహ్రాన్: తమ జాతీయ భద్రతకు హామీ ఇవ్వకపోతే ఏ మౌలిక సదుపాలయాలు సురక్షితంగా ఉండబోవని ఇరాన్ స్పష్టం చేసింది. తాము చమురు విక్రయించని ప్రాంతంలో మరెవరూ విక్రయించలేరని ఇరాన్ పార్లమెంటు స్పీకర్ మహమ్మద్ బాగేర్ గాలిబాఫ్ మంగళవారం మీడియా సమావేశంలో వెల్లడించారు. హోర్మూజ్ జలసంధిపై అమెరికాకు పూర్తి నియంత్రణ ఉందని ఆదేశాధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. జల సంధి తెరిచేందుకు ఇరాన్ ఏడు రోజుల ప్రణాళికను తిరస్కరించారు. హోర్మూజ్ జలసంధిని ‘ట్రంప్ జలసంధి’ అని పేరు పెట్టాలంటూ ఒక వివాదాస్పద మ్యాప్‌ను పంచుకున్నారు. అయితే ట్రంప్ తీరును గాలిబాఫ్ తీవ్రంగా ఖండించారు. ఆయన ప్రసంగాలు బాధ్యతారహితంగా ఉన్నట్లు దుయ్యబట్టారు. ప్రాంతీయ భద్రతను అంతర్జాతీయ చమురు సరఫరాతో ముడిపెట్టడం… ఇరాన్ భద్రతకు ముప్పు ఏర్పడేలా చేయడం తగదని, ఇది కొనసాగితే అన్ని దేశాల మౌలిక వసతులకు ముప్పు వాటిల్లుతుందని గాలిబాఫ్ హెచ్చరించారు. సైనిక వ్యూహకర్తల ప్రణాళిక ‘ఆపరేషన్ సమీన్ అల్-ఇమామ్’లో కమాండర్లు, సైనికుల వీరోచిత పోరాటం వల్లే అబాదాన్ ముట్టడిని అడ్డుకోగలిగామని ఆయన గుర్తుచేశారు. ‘1980లో శత్రువులు అబాదాన్ చుట్టూ రవాణా మార్గాలను మూసివేశారు. దేశానికి ఇంధన కేంద్రమైన అబాదాన్ ఆయిల్ రిఫైనరీని ఫిరంగి దాడులతో ధ్వంసం చేశారు. దాంతో చమురు పైప్లైన్లు దెబ్బతిన్నాయి. నీటి, విద్యుత్ నెట్వర్కులు ధ్వంసమయ్యాయి. కృత్రిమ కరవు సృష్టించి ప్రజలను లొంగదీసుకోలని అనుకున్నారు. కానీ, అబాదాన్ ప్రజల బలం, ఇస్లాం యోధుల పోరాటం ఆ కుట్రను భగ్నం చేశాయి. ఇరాన్ పట్టుదల వల్ల ఏడాది పాటు సాగిన ఆ ముట్టడి 48 గంటల్లోనే విచ్ఛిన్నమైంది. అప్పటి వ్యూహాల తరహాలోనే, ప్రస్తుతం అమెరికా విధిస్తున్న ఆర్థిక ఆంక్షలు, నౌకా దిగ్బంధనాలను ఇరాన్ సమర్థంగా ఎదుర్కొంటుంది’ అని గాలిబాఫ్ పేర్కొన్నారు.
ఇరాన్ భద్రతకు హామీ లేకపోయిందో…
- Advertisement -
RELATED ARTICLES


