Saturday, May 24, 2025
Homeజిల్లాలువిజయనగరంరేషన్ బియ్యం వాహనాల రద్దు పై డీలర్ల హర్షం

రేషన్ బియ్యం వాహనాల రద్దు పై డీలర్ల హర్షం

విశాలాంధ్ర- రాజాం (విజయనగరం జిల్లా) : ప్రజా పంపిణీ వ్యవస్థలో ఎండీయూ విధానాన్ని రద్దుచేసి రేషన్‌ దుకాణాల ద్వారా సరుకులు పంపిణీకి ప్రభుత్వం నిర్ణయించడంపై విజయనగరం జిల్లా రాజాం మండలంలో రేషన్ డీలర్లు ఆనందం వ్యక్తం చేశారు. రాజాం సివిల్‌ సప్లైస్‌ గోదాము వద్ద సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ చిత్రపటాలకు పాలతో క్షీరాభిషేకం చేశారు.అనంతరం రేషన్ డీలర్లు పరస్పరం స్వీట్లు తినిపించుకున్నారు. నాటి వైసీపీ ప్రభుత్వం డీలర్ల పొట్ట కొడితే కూటమి ప్రభుత్వం ఆదుకుందన్నారు. ఇక ప్రజలు పనులు మానుకుని రేషన్ వాహనం కోసం ఎదురుచూడాల్సిన అవసరం లేదని, నెలలో 15 వ తేదీలోగా లబ్ధిదారులు ఎప్పుడు వచ్చినా సరుకులు ఇస్తామని రేషన్ డీలర్లు తెలిపారు. వచ్చే నెల నుంచి ప్రభుత్వ మార్గదర్శ కాల ప్రకారం రేషన్ సరుకులను యధావిధిగా పంపిణీ చేస్తామని వారు పేర్కొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు