కాలనీ సమస్యలపై దృష్టి సారిస్తాం సిపిఐ జిల్లా కార్యదర్శి సి. జాఫర్
విశాలాంధ్ర – అనంతపురం : అభ్యుదయ కాలనీ సమస్యలపై దృష్టి సారిస్తామని సిపిఐ జిల్లా కార్యదర్శి సి. జాఫర్ పేర్కొన్నారు. నీలం రాజశేఖర్ రెడ్డి భవనం సిపిఐ జిల్లా కార్యాలయం నందు గురువారం సిపిఎం అభ్యుదయ కాలనీ 100 కుటుంబాలు సిపిఐ నగర్ సమితి ఆధ్వర్యంలో భారత్ కమ్యునిస్ట్ పార్టీ (సీపీఐ) చేరిక కండువా వేసి సిపిఐ జిల్లా కార్యదర్శి సీ.జాఫర్ ఆహ్వానించారు. ఈ సమావేశంలో సిపిఐ నగర సహా కార్యదర్శి రమణ అధ్యక్షత వహించగా ముఖ్య అతిథులుగా సిపిఐ జిల్లా కార్యదర్శి సీ.జాఫర్ జిల్లా సహాయ కార్యదర్శి నారాయణ స్వామి, నగర కార్యదర్శి శ్రీరాములు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పేద ప్రజలు, కష్టజీవులు, కర్షకులు, కార్మికుల పార్టీ సిపిఐ అని, సుదీర్ఘ పోరాటాలు, త్యాగాలతో నిర్మితమైన ఎర్ర జెండా పార్టీకి ఎదురులేదని, మరో వందేళ్లైనా చెక్కు చెదరకుండా అజేయంగా నిలుస్తుందని, నిరంతరం సమరశీల పోరాటాలు సాగిస్తున్న సిపిఐ ఒక ప్రాంతానికో, ఒక వర్గానికో పరిమితమైన పార్టీ కాదని స్పష్టం చేశారు. పార్టీ పటిష్ఠతకోసం శక్తివంచన లేకుండా క్రమశిక్షణతో కృషి చేస్తామన్నారు. పీడిత ప్రజల సమస్యల పరిష్కారం కోసం సిపిఐ పార్టీ ఎప్పుడు ముందుంటుందన్నారు. నగరంలో అనేక కమ్యూనిస్టు పార్టీ కాలనీ నిర్మాణంలో కమ్యూనిస్టు పార్టీ నాయకుల కృషి ఎంతో ఉందన్నారు. దౌర్జన్యపరులకు భు దళారులకు, కబ్జాదారులకు సిపిఐ పార్టీ పోరాటాలు ఎప్పుడు ముందుంటుందని రాబోయే కాలంలో అభ్యుదయ కాలనీ సమస్యలు పరిష్కరించే వైపుగా దృష్టి పెడతామన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు లింగమయ్య సహాయ కార్యదర్శులు రమణయ్య అలిపిర, ఏఐవైఎఫ్ జిల్లా కార్యదర్శి సంతోష్ కుమార్, ఇన్సఫ్ నగర అధ్యక్షుడు చాంద్ బాషా, నగర కార్యవర్గ సభ్యులు మున్నా, నవ యుగ శాఖకాలనీ రాజు,నాగప్ప అభ్యుదయ కాలనీ శాఖ కార్యదర్శి లక్ష్మీనారాయణ, నాగభూషణం, పద్మ తదితరులు పాల్గొన్నారు..