Thursday, December 5, 2024
Homeజిల్లాలుఅనంతపురంవిద్యుత్ సమస్యల పరిష్కారంపై ప్రత్యేక దృష్టి

విద్యుత్ సమస్యల పరిష్కారంపై ప్రత్యేక దృష్టి

దరఖాస్తు చేసుకున్న రైతులకు ట్రాన్స్ఫార్మర్లు, వైర్లు అందించేందుకు అధికారులు కృషి చేయాలి
జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్.వి
విశాలాంధ్ర- అనంతపురం : విద్యుత్ సమస్యలు పరిష్కరించాలని, దరఖాస్తు చేసుకున్న రైతులకు ట్రాన్స్ఫార్మర్లు, వైర్లు అందించేందుకు చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్.వి పేర్కొన్నారు. అనంతపురం రేడియో స్టేషన్ లో గురువారం ఉదయం 7:45 గంటల నుంచి 8:15 గంటల వరకు ఆకాశవాణి ఫోన్ ఇన్ కార్యక్రమంలో పాల్గొని విద్యుత్ సమస్యల అంశంపై విద్యుత్ శాఖ అధికారులతో కలిసి జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్.వి రైతులకు సూచనలు, సలహాలు అందజేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ దరఖాస్తు చేసుకున్న రైతు సోదరులకు ట్రాన్స్ఫార్మర్లు, వైర్లు త్వరితగతిన అందించేందుకు జిల్లా అధికారులు కృషి చేయాలన్నారు. ఈ సందర్భంగా అనంతపురం జిల్లాలోని పలు ప్రాంతాల రైతుల, ప్రజల నుండి 19 ఫోన్ కాల్స్ స్వీకరించి వారి సమస్యలను తెలుసుకుని వాటిని పరిష్కరించే విధంగా చూడాలని, ఏ రైతు విద్యుత్తు సమస్య వలన పంట నష్టం జరగకుండా అధికారులంతా కలిసికట్టుగా పనిచేయాలని జిల్లా కలెక్టర్ విద్యుత్ శాఖ అధికారులకు పలు సలహాలు, సూచనలు ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ కలెక్టర్ బి.విన్నూత్న, ఏపీఎస్పీడీసీఎల్ ఎస్ఈ సంపత్, డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ రామకృష్ణ, ఏఈ భాను ప్రకాష్, జేఈ ముని రాజా, డైరెక్టర్ ఆకాశవాణి అనంతపురం నాగేశ్వరరావు, తదితర సిబ్బంది పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు