Homeజిల్లాలుశ్రీ సత్యసాయిరాష్ట్ర సుభిక్షమే గరుడసేవ లక్ష్యం

రాష్ట్ర సుభిక్షమే గరుడసేవ లక్ష్యం

- Advertisement -

అడ్ హక్ కమిటీ చైర్మన్ చెన్నం శెట్టి జగదీశ్వర ప్రసాద్
విశాలాంధ్ర ధర్మవరం;; రాష్ట్ర సుభిక్షమే, ప్రజల ఆరోగ్యమే గరుడసేవ యొక్క లక్ష్యంతో ప్రతినెల గరుడ సేవను నిర్వహిస్తున్నామని ఆలయ అడహక్ చైర్మన్ చెన్నం శెట్టి జగదీశ్వర ప్రసాద్, ఆలయ ఈవో వెంకటేశులు తెలిపారు. ఈ సందర్భంగా పట్టణంలోని బ్రాహ్మణ వీధిలో గల పుణ్యక్షేత్రమైన శ్రీ లక్ష్మీ చెన్నకేశవ స్వామి ఆలయంలో సాయంత్రం పున్నమి గరుడసేవను నిర్వహించారు. అనంతరం అర్చకులు కోనేరాచార్యులు, మకరంద బాబు, భాను ప్రకాష్, లు ప్రత్యేక పూజలు, అర్చనలు నిర్వహించారు. వివిధ పూలమాలలతో అలంకరించిన గరుడ ఉత్సవ విగ్రహానికి, స్వామివారికి వివిధ పూలమాలలతో అలంకరించిన వైనం భక్తాదులను విశేషంగా ఆకట్టుకుంది. ఈ గరుడ సేవకు దాతగా ఆలయ అడహక్ కమిటీ చైర్మన్ వ్యవహరించారు. దీంతో ఆలయ ఈవో, అర్చకులు దాతను ఘనంగా సన్మానించారు. అనంతరం స్వామి వారు ప్రత్యేక పల్లకిలో పట్టణ పురవీధులలో ఊరేగించారు. ఈ కార్యక్రమంలో అన్నమయ్య సేవా మండలి శిష్యా బృందం, భక్తాదులు, పట్టణ ప్రజలు, ఆలయ సిబ్బంది రామశాస్త్రి, మల్లికార్జున, హరి తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు