Saturday, June 21, 2025
Homeజిల్లాలువిజయనగరంసత్య విద్యా సంస్థ ల ఆధ్వర్యంలో అంతర్జాతీయ యోగ దినోత్సవం

సత్య విద్యా సంస్థ ల ఆధ్వర్యంలో అంతర్జాతీయ యోగ దినోత్సవం

విశాలాంధ్ర -విజయనగరం టౌన్ : స్థానిక గాజులరేగ పరిధిలోగల సీతం ఇంజనీరింగ్ కళాశాలలో అంతర్జాతీయ యోగా దినోత్సవం ను సత్య ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ మేనేజ్మెంట్, సత్య డిగ్రీ& పీజీ కళాశాల సంయుక్తంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథి లుగా బ్రహ్మ కుమారి విజయనగరం నుంచి యోగ గురు టి. వినోద్ , బ్రహ్మ కుమారి వైష్ణవి పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో వినోద్ యోగా ను రోజువారి దినచర్యలో చేర్చడం వల్ల మన శారీరక, మానసిక , ఆధ్యాత్మిక శ్రేయస్సును ఎలా మెరుగుపరుస్తుంది అనే దానిని క్లుప్తంగా వివరించారు. ఆయుష్ వారి యోగా ప్రోటోకాల్ ప్రకారంగా ఆసనాలు వేయించి ప్రాణాయామం చేయించారు. ధ్యానం గురించి వైష్ణవి వివరించి అందరితో ధ్యానం చేయించారు. కళాశాల సంచాలకులు డాక్టర్.మజ్జి శశిభూషణ్ రావు మాట్లాడుతూ సామాజిక సామరస్యము , సామాజిక సంక్షేమం లో యోగ ముఖ్య పాత్ర గురించి వివరించారు. ఈ సంవత్సరం మన విశాఖపట్నం లో అతి పెద్ద ఎత్తు లో యోగా డే చెయ్యడం వరల్డ్ రికార్డ్ కి ప్రయత్నించడం అందులో మన సత్య విద్యా సంస్థ ల విద్యార్థులు 650 మంది పాల్గొన్నారని వివరించారు.ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ డి వి రామ్మూర్తి ప్రతిరోజు యోగ సాధన చేయాలని శారీరక , మానసిక ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని అందిరి తో ప్రమాణం చేయించారు.ఈ కార్యక్రమంలో సత్య డిగ్రీ & పీజీ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ సాయి దేవమణి ప్రసంగిస్తూ యోగ ప్రయోజనాలను, విద్యార్థి దశలోను మరియు నిత్య జీవితానికి ఏ విధంగా అవసరంమో తెలియజేశారు.ఈ కార్యక్రమంలో ఎన్. సి. సి ఆఫీసర్ కెప్టెన్ ఎం సత్య వేణి, ఎన్ సి సి గర్ల్ క్యాడెట్లు ఇతర సిబ్బంది , అధ్యాపకులు మరియు , విద్యార్థులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు