విశాలాంధ్ర ధర్మవరం:: ప్రతి ఒక్కరూ మొక్కలను నాటి వాటి సంరక్షణ బాధ్యతను తీసుకోవాలని ఏపీఓ అనిల్ కుమార్ రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మండల పరిధిలోని నిమ్మలకుంట గ్రామములో ప్రాథమిక పాఠశాల యందు ఉపాధి హామీ పథకము ద్వారా ఇన్స్టిట్యూషన్ ప్లాంటేషన్ కార్యక్రమం చేపట్టడం జరిగిందని తెలిపారు. పాఠశాల ఆవరణములో పిచ్చి మొక్కలను గ్రామస్తుల సహకారంతో తొలగించిన ప్రతిప నోరు మొక్కలను నాటి సంరక్షణ చేయుట కోసం ఉపాధి హామీ క్రింద రూ. 1,20,000 ఖర్చు చేయడం జరుగుతుందని వారు తెలిపారు. ముఖ్యఅతిథిగా విచ్చేసిన జిల్లా అంబుష్ మెన్ శివారెడ్డి మొక్కలను నాటే కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగిందని తెలిపారు. అనంతరం వారు మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణ కోసం ఇలాంటి కార్యక్రమాలను విరివిగా చేపట్టి, కాలుష్య నివారణ కోసం అందరూ కృషి చేయాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో హెడ్మాస్టర్ వేణుగోపాల్ టి. ఏ. చంద్రకళ,పంచాయతీ కార్యదర్శి జయంత్ రెడ్డి,చంద్రశేఖర్,గ్రామ నాయకులు, ప్రజలు, కూలీలు పాల్గొన్నారు.
మొక్కలను నాటి, సంరక్షించాలి… ఏపీఓ అనిల్ కుమార్ రెడ్డి
RELATED ARTICLES