Friday, December 13, 2024
Homeజిల్లాలుశ్రీ సత్యసాయిసైబర్ నేరాలపై అవగాహన చేసుకోవాలి..

సైబర్ నేరాలపై అవగాహన చేసుకోవాలి..

వన్టౌన్ సిఐ నాగేంద్రప్రసాద్

విశాలాంధ్ర -ధర్మవరం : సైబర్ నేరాలపై ప్రతి ఒక్కరూ తప్పక అవగాహన చేసుకోవాలని వన్టౌన్ సిఐ నాగేంద్ర ప్రసాద్ తెలిపారు. ఈ సందర్భంగా వారు పట్టణంలోని ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాలలో మహిళలపై జరుగుతున్న నేరాలు, సైబర్ నేరాలపై విద్యార్థినీలకు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. అనంతరం వారు మాట్లాడుతూ ప్రస్తుతం మైనర్ గా ఉన్న విద్యార్థినిలు జాగ్రత్తగా ఉండాలని, కొత్త వ్యక్తులతో పరిచయం చేసుకొని జీవితాన్ని నాశనం చేసుకోవద్దని తెలిపారు. అదేవిధంగా నిత్యజీవితంలో ఒక భాగమైన సెల్ఫోన్లను కేవలం చదువు కొరకు మాత్రమే సంబంధించిన వాటిని మాత్రమే చూసుకోవాలని, ఇతరత్రా వేరేవి చూసుకున్నట్లయితే జీవితాలు నాశనం అవుతాయని తెలిపారు. ప్రతి ఒక్క విద్యార్థిని చదువుకు ప్రాధాన్యత ఇస్తూ, అమ్మానాన్నల కష్టాన్ని గుర్తించాలని తెలిపారు. అప్పుడే కుటుంబానికి, కళాశాలకు మంచి గుర్తింపు లభిస్తుందని తెలిపారు. ఇక సైబర్ నేరాలు దేశవ్యాప్తంగా జరుగుతున్నాయని, వాటిపైన చక్కటి అవగాహన చేసుకున్నప్పుడే, మన దగ్గర ఉన్న డబ్బు పదిలంగా ఉంటుందని తెలిపారు. సెల్ ఫోన్ లో ఏది పడితే అది సబ్స్క్రైబ్ చేయడం, యాపులను డౌన్లోడ్ చేయడం, పరిచయం లేని వ్యక్తి, వివరాలు, బ్యాంకు ఖాతా వివరాలు తెలియజేయమని చెప్పినప్పుడు ఏ మాత్రమూ స్పందించకూడదని తెలిపారు. సైబర్ నేరాలపై మీ కుటుంబంతో పాటు ఇతరులు కూడా అవగాహన కల్పించాలని తెలిపారు. భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని చక్కటి చదువును కొనసాగిస్తూ ఉజ్వల భవిష్యత్తుకు శ్రీకారం చుట్టాలని తెలిపారు. మీ భద్రత, మీ భవిష్యత్తు మీ చేతిలోనే ఉందని తెలిపారు. అధ్యాపకులకు తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకుని, మంచి గుర్తింపును పొందాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో కళాశాల ఇంచార్జ్ ప్రిన్సిపాల్ తో పాటు, అధ్యాపకులు, విద్యార్థినీలు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు