Friday, December 13, 2024
Homeజిల్లాలుశ్రీ సత్యసాయిమౌలానా ముస్తాక్ అహ్మద్ కలిసిన సత్యసాయి జిల్లా తెలుగుదేశం పార్టీ మైనార్టీలు

మౌలానా ముస్తాక్ అహ్మద్ కలిసిన సత్యసాయి జిల్లా తెలుగుదేశం పార్టీ మైనార్టీలు

విశాలాంధ్ర-ధర్మవరం : ఉమ్మడి జిల్లాలోని పలువురు తెలుగుదేశం పార్టీ మైనార్టీ సోదరులు ఇటీవల మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ గా మౌలానా ముస్తాక్ అహ్మద్ ఎంపికైనందుకు సోమవారం నంద్యాల పట్టణంలోని ఆయన కార్యాలయంలో ఆయనను మర్యాదపూర్వకంగా కలిసి , దుశ్శల్వా తో సన్మానించి, పుష్పగుచ్ఛంతో శుభాకాంక్షలు ఉమ్మడి జిల్లా తెలుగుదేశం పార్టీ మైనార్టీ సోదరులు తెలిపారు.ఈ సందర్భంగా ఉమ్మడి జిల్లాలోని మైనార్టీ సోదరులకు సంబంధించిన పలు సమస్యలపై ఆయనతో చర్చించారు. అనంతరం చైర్మన్ స్పందిస్తూ సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకుని వెళ్లి పరిష్కరించే దిశలో తాను కృషి చేస్తానని వారు హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో సత్యసాయి జిల్లా ధర్మవరం,పుట్టపర్తి,కదిరి, ఉరవకొండ,నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ మైనార్టీ సోదరులు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు