Homeజిల్లాలుశ్రీ సత్యసాయిధర్మవరంలో రైతు కిడ్నాప్ కలకలం

ధర్మవరంలో రైతు కిడ్నాప్ కలకలం

- Advertisement -

భూ వివాదంతో ఇన్నోవాలో బలవంతంగా తీసుకెళ్లిన దుండగులు

కారులోనే రైతుపై దాడి.. రూ.50 లక్షలు డిమాండ్

ఫిర్యాదు అందుకున్న వెంటనే రంగంలోకి వన్‌టౌన్ పోలీసులు

ఎన్‌ఎస్ గేట్ వద్ద ఇన్నోవా వాహనం అడ్డగింత

ఆరుగురు నిందితులను అదుపులోకి తీసుకున్న పోలీసులు

వన్ టౌన్ సీఐ నాగేంద్ర ప్రసాద్

విశాలాంధ్ర ధర్మవరం : పట్టణంలో రైతు కిడ్నాప్ ఘటన తీవ్ర కలకలం రేపింది. ధర్మవరం నియోజకవర్గంలోని ముదిగుబ్బ మండలం కమ్మవారిపల్లికి చెందిన ముసుగు నారాయణ అనే రైతును భూ వివాదం నేపథ్యంలో ప్రత్యర్థులు బలవంతంగా కారులో ఎక్కించి తీసుకెళ్లిన ఘటన చోటుచేసుకుంది. ఘటనపై వెంటనే స్పందించిన వన్‌టౌన్ పోలీసులు కేవలం గంట నిందితులను అదుపులోకి తీసుకొని అరెస్టు చేశారు.
ఈ ఘటనపై వన్‌టౌన్ సీఐ నాగేంద్ర ప్రసాద్ మీడియాతో మాట్లాడుతూ,
ముసుగు నారాయణకు సంబంధించిన భూమిపై 1997 సంవత్సరం నుంచి భూ తగాదా కొనసాగుతోందన్నారు.ఈ విషయంలో మూడు నెలల క్రితం ధర్మవరం ఆర్డీవో కోర్టులో నారాయణ దావా వేశారని తెలిపారు. ఆ కేసుకు సంబంధించిన మూడో వాయిదా కోసం శుక్రవారం ఆర్డీవో కార్యాలయానికి నారాయణ వచ్చాడన్నారు.
అదే భూమి విషయంలో ప్రత్యర్థులైన కంద్యాల నారాయణ కుమారుడు రవి, అతని కుమారుడు అరుణ్‌తో పాటు మరో ఐదుగురు కలిసి నారాయణ ఆర్డీవో కార్యాలయానికి వచ్చిన విషయాన్ని తెలుసుకుని, అందరూ చూస్తుండగానే బలవంతంగా ఇన్నోవా వాహనంలోకి ఎక్కించుకొని వెళ్లిపోయారని తెలిపారు.
వాహనంలోనే నారాయణపై విచక్షణారహితంగా దాడి చేసి, నిరూ.50 లక్షలు ఇస్తావా..లేక మా భూమి మాకు అప్పగిస్తావా” అంటూ బెదిరింపులకు పాల్పడ్డారని తెలిపారు అన్నారు. అంతే కాకుండా రూ.50 లక్షలకు ప్రామిసరీ నోట్ కూడా రాయించుకున్నట్లు బాధపడుతూ వెల్లడించారు అని తెలిపారు.ఈ ఘటనపై నారాయణ కుమారుడు వెంటనే వన్‌టౌన్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయడంతో పోలీసులు అప్రమత్తమై నిందితులను వెంబడించారు. ఎన్ ఎస్ గేట్ సమీపంలో ఇన్నోవా వాహనాన్ని అడ్డుకుని ఆరుగురు నిందితులను అరెస్ట్ చేసినట్లు తెలిపారు.
నిందితులపై కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో వన్ టౌన్ ఎస్సై ఉమాదేవి, వన్ టౌన్ పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు