Wednesday, November 27, 2024
Homeజిల్లాలుశ్రీ సత్యసాయిశ్రీ లక్ష్మీ చెన్నకేశవ స్వామి ఆలయమునకు గంట విరాళం చేసిన దాత..

శ్రీ లక్ష్మీ చెన్నకేశవ స్వామి ఆలయమునకు గంట విరాళం చేసిన దాత..


విశాలాంధ్ర -ధర్మవరం : పట్టణములోని బ్రాహ్మణ వీధిలో గల శ్రీ లక్ష్మీ చెన్నకేశవ స్వామి అతి పురాతనమైన దేవాలయమునకు నైవేద్య గంటను పట్టణంలోని దుర్గా నగర్ కు చెందిన
రియల్ ఎస్టేట్ వ్యాపారి కుంచపు వడ్డే లక్ష్మీ ప్రసాద్, భార్య లక్ష్మీకాంతమ్మ భక్తితో నైవేద్య గంటను ఆలయ ఈవో వెంకటేషులకు సమర్పించారు.ఈ సందర్భంగా ఆలయ ఈవో మాట్లాడుతూ ఆలయ గంట 221 కేజీలు బరువు కలదని, దీని విలువ రూ. .5,50,000 కలదని తెలిపారు. దాతలచే ప్రత్యేక పూజలతో పాటు అర్చకుల నడుమ హోమములను కూడా నిర్వహించడం జరిగిందని తెలిపారు. తొలుత అర్చకులు కోనేరాచార్యులు మకరంద బాబు, భాను ప్రకాష్, చక్రధర్, మారుతీ వేద మంత్రాలు మంగళ వాయిద్యాలు నడుమ దాతల దంపతులచే ప్రత్యేక పూజలతో పాటు హోమములను నిర్వహించడం జరిగిందని తెలిపారు. దాతలు మాట్లాడుతూ అతి పురాతనమైన దేవాలయమునకు తన కుటుంబం తరఫున ఈ నైవేద్య గంటను సమర్పించడం నాకు ఎంతో సంతోషాన్ని కలిగించిందని, భక్తి భావంతో తాను సమర్పించడం జరిగిందని తెలిపారు. ఈ నైవేద్య గంట ఆలయానికి వన్నె తెస్తుందని, ఆలయ గంట మోగినప్పుడు భక్తి భావంతో భక్తాదులు ఉప్పొంగి పోతారని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఈవో తో పాటు మాజీ ఆలయ చైర్మన్ దాశెట్టి సుబ్రహ్మణ్యం, అన్నమయ్య సేవా మండలి అధ్యక్షులు పోరాల్ల పుల్లయ్య వారి శిష్య బృందం, ఆలయ సిబ్బంది, భక్తాదులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు