Tuesday, December 10, 2024
Homeఆంధ్రప్రదేశ్శరీర అవయవాల వైద్య పరీక్షలు ప్రతి ఒక్కరూ చేయించుకోవాలి..

శరీర అవయవాల వైద్య పరీక్షలు ప్రతి ఒక్కరూ చేయించుకోవాలి..

అప్పుడే ఆరోగ్య పరిస్థితి తెలుస్తుంది.. ఆయుర్వేదిక్ న్యూట్రీషియన్ అడ్వైజర్ దామోదర్
విశాలాంధ్ర ధర్మవరం : శరీర అవయవాల వైద్య పరీక్షలు ప్రతి ఒక్కరూ చేయించుకుంటే ఆరోగ్య పరిస్థితి తెలుస్తుందని ఆయుర్వేదిక్ న్యూట్రీషియన్ అడ్వైజర్ దామోదర్ తెలిపారు. ఈ సందర్భంగా వారు పట్టణంలోని లక్ష్మీ చెన్నకేశవపురం 26వ వార్డులో పెద్దమ్మ తల్లి దేవాలయం దగ్గర బాడీ హెల్త్ చెకప్ ను నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దామోదర్గా తాను తన మిత్రుడు రాజు కలిసి నేటి కాలంలో పేద ప్రజలు యొక్క ఆరోగ్య పరిస్థితిని దృష్టిలో ఉంచుకొని కేవలం బాడీ హెల్త్ చెకప్ ను 100 రూపాయలకే చేయించాలన్న తలంపుతోనే ఈ శిబిరమును నిర్వహించడం జరిగిందని తెలిపారు. కేఈవిఎ-బిఎంఐ 4జి క్వాంటం మిషన్ల ద్వారా ఈ పరీక్షలను నిర్వహించడం జరిగిందని తెలిపారు. ఈ చెక్కకు ద్వారా మన శరీరంలోని అవయవాలు ఆరోగ్యంగా ఉన్నాయా? లేదా? అన్న సమస్యలు కేవలం 10 నిమిషాలలోనే తెలుసుకొనే అవకాశం ఉందని తెలిపారు. ఎలాంటి అనారోగ్య సమస్య ఉన్నా కూడా ఆయుర్వేదిక్ మందుల ద్వారా శాశ్వత పరిష్కారం లభిస్తుందని తెలిపారు. ఈ శిబిరంలో 50 మంది వైద్య పరీక్షలకు (బాడీ హెల్త్ చెకప్) రావడం జరిగిందని తెలిపారు. తదుపరి ఆరోగ్యం పట్ల తీసుకోవలసిన జాగ్రత్తలను గూర్చి వివరించడం జరిగిందని తెలిపారు. శరీరములో ఏదో ఒక అవయం పనిచేయకపోతే అనారోగ్య సమస్యలు తప్పక వస్తాయని తెలిపారు. కావున అనారోగ్య విషయంలో ఎప్పటికప్పుడు వైద్య చికిత్సలు పొందాల్సిన అవసరం ఉందని తెలిపారు. అనంతరం లక్ష్మీ చెన్నకేశవపురం ప్రజలు ఈ క్యాంపు నిర్వహణ పట్ల నిర్వాహకులకు కృతజ్ఞతలను తెలియజేశారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు