బాలవికాస్ కోఆర్డినేటర్ కరణం ఆదిలక్ష్మి, జనార్ధన్
విశాలాంధ్ర ధర్మవరం : పుట్టపర్తి భగవాన్ శ్రీ సాయిబాబా వారి 99వ జన్మదినోత్సవ వేడుకలు సందర్భంగా ఇటీవల జాతీయ వ్యాసరచన పోటీలు, ధర్మవరంలో నిర్వహించడం జరిగింది అని ధర్మవరం విద్యార్థులు మంచి ప్రతిభ కనబరిచి గుర్తింపు తేవడం జరిగిందని బాలవికాస్ కోఆర్డినేటర్లు కరణం ఆదిలక్ష్మి ,జనార్దన్లు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ వ్యాసరచన పోటీలు శ్రీ సత్య సాయి సేవా సమితి ఆధ్వర్యంలో 24 పాఠశాలల నుండి 1500 మంది పాల్గొనడం జరిగిందని, అదేవిధంగా ఐదు జూనియర్ కళాశాలల నుండి 100 మంది, రెండు డిగ్రీ కళాశాల నుండి 35 మంది పాల్గొనడం జరిగిందని తెలిపారు. ఇందులో వ్యాసరచన పోటీల్లో ప్రతిభ ఘనపరిచిన వారిలో పట్టణంలోని కాగితాల వీధిలో గల ప్రణవ సాయి ఇంగ్లీష్ మీడియం స్కూల్ టీ. మమతారెడ్డి ప్రధమ బహుమతి పొందిందని, జూనియర్ కళాశాల నుండి షేక్ పరహాన్ ద్వితీయ బహుమతిని గెలుపొందిందని, శ్రీ పద్మావతి డిగ్రీ కళాశాల నుండి టీ. హర్షియా ద్వితీయ బహుమతిని పొందిందని తెలిపారు. వీరందరికీ ప్రశంసా పత్రాలను, బహుమతులను పుట్టపర్తి జిల్లా అధ్యక్షులు సత్యనారాయణమూర్తి చేతుల మీదుగా అందుకోవడం జరిగిందన్నారు. అనంతరం వ్యాసరచన పోటీల్లో ప్రతిభ ఘనపరిచిన విద్యార్థిని, విద్యార్థులకు శుభాకాంక్షలు కూడా తెలియజేశారు.
వ్యాసరచన పోటీల్లో ధర్మవరం విద్యార్థుల ప్రతిభ
RELATED ARTICLES