Homeజాతీయంరాజస్థాన్‌లో కుప్పకూలిన యుద్ధ విమానం.. పైలట్ దుర్మరణం

రాజస్థాన్‌లో కుప్పకూలిన యుద్ధ విమానం.. పైలట్ దుర్మరణం

- Advertisement -

రాజస్థాన్‌లో చూరు జిల్లాలో బుధవారం విమాన ప్రమాదం సంభవించింది. విమానం కుప్పకూలిపోవడంతో అందులో ప్రయాణిస్తున్న పైలట్ దుర్మరణం పాలయ్యారు. చూరు జిల్లా పరిధిలోని ఓ ప్రాంతంలో ఎయిర్‌ఫోర్స్‌కు చెందిన జాగ్వార్ ఫైటర్ జెట్ విమానం కూలిపోయినట్లు స్థానిక అధికారులకు సమాచారం అందింది.వెంటనే పోలీసులు, సహాయక బృందాలు సంఘటనా స్థలానికి చేరుకున్నాయి. అక్కడ విమాన శకలాలను, పైలట్ మృతదేహాన్ని గుర్తించారు. ఈ ప్రమాదం జరగడానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు. ప్రమాద సమాచారం తెలియడంతో ఉన్నతాధికారులు దర్యాప్తు ప్రారంభించారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు