డి.ఎస్.పి హేమంత్ కుమార్
విశాలాంధ్ర ధర్మవరం;; పట్టణంలోని గీతా నగర్ కు చెందిన రమాదేవి వద్ద పదివేల రూపాయలను ఇదే పట్టణానికి చెందిన యలమల రాజశేఖర్ (చాకలి శేఖర్) అప్పు తీసుకున్నాడు. అవమానంగా భావించిన రాజశేఖర్,రమాదేవిని నిర్దాక్షిణ్యంగా హత్య చేసే ప్రయత్నం చేశాడు. చివరకు చికిత్స పొందుతూ రమాదేవి మృతి చెందింది. ఈ సందర్భంగా డిఎస్పి హేమంత్ కుమార్ వన్ టౌన్ పోలీస్ స్టేషన్లో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ రెండు సంవత్సరాల క్రితం రాజశేఖర్ అప్పు తీసుకోవడంతో రమాదేవి పదేపదే అప్పు విషయాన్ని అడిగినా కూడా ఇవ్వలేదు అని, ఇందులో భాగంగా జూన్ 29వ తేదీన సాయంత్రం ముద్దాయి రాజశేఖర్ అవమానంగా భావించి, రమాదేవి ఇంటిలోకి వెళ్లి, డబ్బు అడుగుతావా అని తెలుపుతూ చెంపలకు కొట్టి, అరవకుండా నోరు మూసి పెట్టి రెండు చేతులతో క్రిందకు దెబ్బగా రమాదేవి కింద పడిపోగానే, అక్కడే ఉన్న టెంకాయ తాడు తీసుకొని రమాదేవి గొంతుకు గట్టిగా తాడుతో బిగించడం జరిగిందన్నారు. తదుపరి రాజశేఖర్ పదారీగాగా రమాదేవి ప్రాణాలతో బయటపడి ఆ రోజే ధర్మవరం ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొంది, మెరుగైన వైద్యం కోసం అనంతపురం ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఈనెల నాలుగవ తేదీన అనంతపురం ప్రభుత్వ ఆసుపత్రిలో మృతి చెందింది అని తెలిపారు. అనంతరం ఈనెల 7వ తేదీ మధ్యాహ్నం సిఐ నాగేంద్రప్రసాద్ ,సిబ్బంది శివకుమార్, నాగాంజనేయులు ,రాజప్ప ,షాకీర్, బయన్న, సుధీర్ కుమార్ ,రాజన్న సహాయముతో అరెస్టు చేయడం జరిగిందని తెలిపారు. ఈ కేశను త్వరితగతంగా ఛేదించడంతో డిఎస్పి సిఐను, సిబ్బందిని అభినందించారు.
అప్పు అడిగినందుకు హత్య చేసిన నిందితుడు అరెస్ట్..
- Advertisement -
RELATED ARTICLES


