జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిలకం మధుసూదన్ రెడ్డి
విశాలాంధ్ర ధర్మవరం : ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకములను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిలకం మధుసూదన్ రెడ్డి పేర్కొన్నారు. ఈ సందర్భంగా వారు మండల పరిధిలోని రేగాటిపల్లి గ్రామంలో హౌసింగ్ ఏఈ. భార్గవి, సచివాలయ సిబ్బంది, గ్రామస్తులతో కలిసి సమావేశాన్ని ఏర్పరిచారు. అనంతరం చిలక మధుసూదన్ రెడ్డి మాట్లాడుతూ ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం కింద 1.5 లక్షలు రూపాయలు, రాష్ట్ర షేర్ కింద లక్ష రూపాయలు, అలాగే జాబ్ కార్డు ఉంటే అదనంగా 30 వేల రూపాయలు మొత్తం వెరసి రూ .2,80,000, స్థలము ఉండి ఇల్లు లేని పేదలకు ఇల్లు నిర్మిస్తుందని వారు తెలిపారు. పేదలకు ఇల్లు నిర్మించడమే ధ్యేయంగా ఎన్డీఏ కూటమి పనిచేస్తుందని తెలిపారు. తదుపరి అర్హులైన లబ్ధిదారులతో దరఖాస్తులను ప్రాసెసింగ్ మొదలు పెట్టాలని హౌసింగ్ ఏఈ, సచివాలయ సిబ్బందికి సూచించడం జరిగిందని తెలిపారు. అదేవిధంగా నియోజకవర్గ వ్యాప్తంగా ఎవరైతే అర్హులైన లబ్ధిదారులు ఉన్నారో వారందరూ కూడా సచివాలయం కు వెళ్లి దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు.
ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకములు ప్రజలు సద్వినియోగం చేసుకోండి..
RELATED ARTICLES