పండుగలు, పెళ్లిళ్ల సీజన్‌కు ముందు బంగారం ధరలు రికార్డు స్థాయిలో పెరుగుతున్నాయి. ముఖ్యంగా శ్రావణమాసం ప్రారంభం కావడం, వరుస పండుగల నేపథ్యంలో ప్రజలు బంగారం కొనుగోలుకు సిద్ధమవుతుండగా, బంగారం ధరలు ఊహించని స్థాయిలో పెరిగి లక్ష రూపాయల మార్క్‌ను దాటేశాయి. గతంలో కొంత కాలం ధరలు స్వల్పంగా తగ్గినా, ఇప్పుడు మళ్లీ గోల్డ్ రేటు పరుగులు పెట్టింది. జులై 23నాటికి పసిడి ధరలు చరిత్రలోనే అత్యధిక స్థాయికి చేరుకోవడం గమనార్హం.
తాజాగా పెరిగిన బంగారం ధరలు సాధారణ ప్రజానికం మధ్య ఆందోళనకు కారణమవుతున్నాయి.
ప్రస్తుతం దేశవ్యాప్తంగా, ముఖ్యంగా హైదరాబాద్, ముంబై, ఢిల్లీ, చెన్నై, బెంగళూరు, విజయవాడ, విశాఖపట్నం వంటి నగరాల్లో బంగారం ధరలు కొత్త రికార్డులు నమోదు చేస్తున్నాయి.
ఈరోజు బంగారం ధరలు – అన్ని క్యారెట్ల వారీగా
24 క్యారెట్ల బంగారం – 1 గ్రాము ధర: రూ. 10,130
22 క్యారెట్ల బంగారం – 1 గ్రాము ధర: రూ. 9,286
18 క్యారెట్ల బంగారం – 1 గ్రాము ధర: రూ. 7,598
ప్రధాన నగరాల్లో 10 గ్రాముల బంగారం ధరలు
ఢిల్లీ
24 క్యారెట్లు – రూ. 1,01,450
22 క్యారెట్లు – రూ. 93,010
ముంబై
24 క్యారెట్లు – రూ. 1,01,300
22 క్యారెట్లు – ₹92,860
చెన్నై
24 క్యారెట్లు – రూ. 1,01,300
22 క్యారెట్లు – ₹92,860
బెంగళూరు
24 క్యారెట్లు – రూ. 1,01,300
22 క్యారెట్లు – ₹92,860
హైదరాబాద్
24 క్యారెట్లు – రూ. 1,01,300
22 క్యారెట్లు – రూ. 92,860
విజయవాడ డ విశాఖపట్నం
24 క్యారెట్లు – రూ. 1,01,300
22 క్యారెట్లు – రూ. 92,860
ఈ ధరల పెరుగుదల వెనుక పలు అంతర్జాతీయ, ఆర్థిక కారణాలు ఉన్నాయని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. అయితే పండుగల సీజన్‌ను పురస్కరించుకొని బంగారం కొనుగోలు చేసేందుకు సన్నాహాలు చేస్తున్న ప్రజలకు ఇది షాకింగ్ న్యూస్ అని చెప్పడంలో సందేహం లేదు.


