Homeజిల్లాలుశ్రీ సత్యసాయినాటు సారా పై విస్తృతంగా దాడులు నిర్వహించండి..

నాటు సారా పై విస్తృతంగా దాడులు నిర్వహించండి..

- Advertisement -

కమిషనర్ నాగ మద్దయ్య
విశాలాంధ్ర ధర్మవరం:: ధర్మవరం ప్రొహిబిషన్ పరిధిలో విస్తృతంగా సారాయి పై దాడులను నిర్వహించాలని అనంతపురం ప్రోహిబిషన్ అండ్ ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ నాగమద్దయ్య, పుట్టపర్తి అసిస్టెంట్ ఎక్సైజ్ చూపెట్ నరసింహులు తెలిపారు. ఈ సందర్భంగా వారు ధర్మారంలోని ఎక్సైజ్ స్టేషను ఆకస్మికంగా తనిఖీ చేశారు. అనంతరం పలు రికార్డులను వారు పరిశీలించారు. అనంతరం వారు మాట్లాడుతూ చాలా రహిత గ్రామాలుగా అధికారులు సిబ్బంది తీర్చిదిద్దాల్సిన అవసరం ఎంతైనా ఉందని, అంతేకాకుండా నాటు సారా పై కలిగే నష్టాలను కూడా ప్రజలకు అవగాహన కల్పించాల్సిన అవసరం కలదు అని తెలిపారు. అదేవిధంగా బైండోవర్సు పై కంప్లీట్ చేయాలని, నవోదయం విజయవంతం చేయాలని తెలిపారు. విధులపై నిర్లక్ష్యం వహిస్తే అధికారులు సిబ్బందిపై కఠిన చర్యలు తప్పవు అని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎక్సైజ్ సీఐ చంద్రమణి ,సబ్ ఇన్స్పెక్టర్ నాగరాజు, సిబ్బంది పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు