డిపో మేనేజర్ సత్యనారాయణ
విశాలాంధ్ర ధర్మవరం;; ధర్మవరం ఆర్టీసీ డిపో ద్వారా ప్రత్యేకమైన బస్సును హనుమాన్ దర్శన్ కోసం ఏర్పాటు చేయడం జరిగిందని కావున భక్తాతలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని డిపో మేనేజర్ సత్యనారాయణ తెలిపారు. అనంతరం వారు మాట్లాడుతూ ఈనెల 26న, 29న, ఆగస్టు 2న, ఆగస్టు 5న, ఆగస్టు 9న, ఆగస్టు 12న, ఆగస్టు 16న, ఆగస్ట్ 19న, ఆగస్టు 23వ తేదీలలో ఈ హనుమాన్ దర్శన్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని తెలిపారు. కసాపురం, మురడి ,నేమకల్లు, అనే ఈ మూడు పుణ్యక్షేత్రాలను ఒకేరోజు దర్శించుటకు వీలుగా, భక్తుల కోరిక మేరకు ఈ రవాణా వ్యవస్థను ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. ఈ పుణ్యక్షేత్రములకు రాను పోను పెద్దలకు 600 రూపాయలు పిల్లలకు 320 రూపాయలు టికెట్టు ధర ఉంటుందని తెలిపారు. అంతేకాకుండా టికెట్లను ముందుగా రిజర్వేషన్ చేసుకునే అవకాశం కూడా ఉందని తెలిపారు. ఒకవేళ రద్దీగా ఉన్న యెడల వాటికి అనుగుణంగా 50 మంది కు ఒకే బ్యాచ్ గా ప్రయాణించడానికి కూడా అదనపు బస్సులను నడుపుతామని తెలిపారు. పట్టణము గాని, గ్రామాల వద్ద గాని 50 మంది ఈ అవకాశాన్ని ఉపయోగించి ఉంటే ఎటువంటి అదనపు చార్జీలు వసూలు చేయబడదు అని తెలిపారు. ఆన్లైన్ ద్వారా గాని, బస్సు రిజర్వేషన్ కౌంటర్ ద్వారా గాని టికెట్లను ముందుగా రిజర్వ్ చేసుకునే అవకాశం కలదని తెలిపారు. భగవంతుని సేవలో భక్తాదులు ఉంటే భక్తుల సేవలో ఆర్టీసీ సంస్థ ఎల్లప్పుడూ ఉంటుందని తెలిపారు. మరిన్ని వివరాలకు సెల్ నెంబర్ 9959225859 గాని 73 82860418 కు సంప్రదించారని తెలిపారు.
హనుమాన్ దర్శన్ ను భక్తాదులు సద్వినియోగం చేసుకోండి
- Advertisement -
RELATED ARTICLES


