బెంగళూరు: టెక్ దిగ్గజం ఇన్ఫోసిస్ కు నూతన సారధిగా ఆసిస్ కుమార్ నియమితులయ్యారు. దేశంలోనే రెండో అతిపెద్ద ఐటీ సంస్థ నాయకత్వంలో కీలక మార్పు చోటుచేసుకుంది. ఇన్ఫోసిస్ కొత్త సీఈఓగా ఆశిష్ కుమార్ దాస్‌ను నియమిస్తూ బోర్డు నిర్ణయం తీసుకుంది. వచ్చే ఏడాది ఏప్రిల్ 1 నుంచి ఈ నియామకం అమల్లోకి రానుంది. ప్రస్తుతం కంపెనీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్, మేనేజింగ్ డైరెక్టర్‌గా కొనసాగుతున్న సలీల్ పరేఖ్ అప్పటి వరకు బాధ్యతల్లో కొనసాగుతారు. కంపెనీ చరిత్రలో సుదీర్ఘకాల నాన్ ఫౌండర్ సీఈఓగా వ్యవహరించిన వ్యక్తిగా సలీల్ నిలవనున్నారు. 2018లో ఇన్ఫోసిస్‌లో చేరిన సలీల్ పరేఖ్ ప్రస్తుత ఐదేళ్ల పదవీ కాలం 2027, మార్చి 31తో ముగియనుంది. ‘ఐటీ ఇండస్ట్రీ గణనీయమైన మార్పుల దశలోకి ప్రవేశిస్తోంది. ఈ క్రమంలో కంపెనీని నడిపించే సామర్థ్యంతో పాటు, ఇన్ఫోసిస్‌ను నిలబెట్టిన విలువలు, వినియోగదారుల విశ్వాసాన్ని కాపాడే నమ్మకమైన వ్యక్తి తదుపరి సీఈఓగా ఉండాలని బోర్డు భావించింది. ఇందులో భాగంగా తదుపరి సీఈఓగా సంస్థలోని నాయకుడైన ఆశిష్ కుమార్ దాస్‌ను నియమించడం పట్ల బోర్డు ఆనందంగా ఉంది’ అని ఇన్ఫోసిస్ బోర్డు ఛైర్మన్ నందన్ నీలేకని ప్రకటించారు.
అపార అనుభవం…
ఐఐటీ ఖర్గపూర్ విద్యనభ్యసించిన ఆశిస్ కుమార్ దాస్‌కు విశేష సాంకేతిక, ఇంజనీరింగ్‌లో అపార అనుభవం ఉంది. ఇన్ఫోసిస్‌తో మూడు దశాబ్దాల ప్రయాణంలో వివిధ కీలక హోదాల్లో పనిచేశారు. డిజిటల్ ట్రాన్స్‌ఫర్మేషన్, గ్లోబల్ ఆపరేషన్స్, కస్టమర్ రిలేషన్స్‌లో అపార అనుభవం సంపాదించారు. ప్రస్తుతం ఆయన ఎగ్జికూట్టివ్ వైస్, గ్లోబల్ హెడ్ (సర్వీసెస్, యుటిలిటీస్, రిసోర్సెస్, ఎనర్జీ అండ్ ఎంటర్‌ప్రైజ్ స్సటైన్ఙలిటీ)గా విధులు నిర్వహిస్తున్నారు. సారధ్య బాధ్యతలు చేపట్టిన తరువాత ఏఐ ఆధారిత వృద్ధి, సాంకేతిక మార్పులపై ప్రత్యేక దృష్టి సారించనున్నారు.


