Homeజిల్లాలుశ్రీ సత్యసాయివైభవంగా శ్రీ చౌడేశ్వరి దేవి 30వ జయంతి ఉత్సవ వేడుకలు..

వైభవంగా శ్రీ చౌడేశ్వరి దేవి 30వ జయంతి ఉత్సవ వేడుకలు..

- Advertisement -

ఆలయ అభివృద్ధి సంఘం
విశాలాంధ్ర ధర్మవరం:: పట్టణంలోని తొగటవీధిలో గల శ్రీ శాంత కళ చౌడేశ్వరి దేవి ఆలయంలో ఈనెల 20వ తేదీ నుండి 24వ తేదీ వరకు ఐదు రోజులు పాటు శ్రీ చౌడేశ్వరీ దేవి 30వ జయంతి ఉత్సవ వేడుకలు ఆలయ అభివృద్ధి సంఘం ఆధ్వర్యంలో అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా ఆలయ అధ్యక్షులు బంధనాథం రమణ, కార్యదర్శి సిరివెళ్ల రాధాకృష్ణ, కోశాధికారి దాసరి వెంకటేశులు (చిట్టి) మాట్లాడుతూ జయంతి ఉత్సవ వేడుకల్లో భాగంగా నాలుగవ రోజు అమ్మవారిని నూతన పట్టు వస్త్రములుచే అలంకరించిన వైనం భక్తాదులను విశేషంగా ఆకట్టుకుంది. తొలుత మహాగణపతి పూజ, పంచామృతాభిషేకం ,కుంకుమార్చనను అర్చకులు వేదమంత్రాల నడుమ నిర్వహించారు. సాయంత్రం అమ్మవారిని ఉయ్యాలో ఉత్సవం కార్యక్రమాన్ని నిర్వహించి మహిళలచే సహస్రనామ పారాయణం కుంకుమార్చన జరిగింది అని తెలిపారు. తదుపరి ఆలయ అభివృద్ధి కమిటీ తరఫున పేద విద్యార్థులకు ఆర్థిక సహాయ కార్యక్రమాన్ని కూడా నిర్వహించడం జరిగిందని తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు బండి నాగరాజు, దాసరి మంజునాథ్, బంధనాథం ప్రకాష్, కాచర్ల నారాయణస్వామి, పెద్దకోట్ల విజయ్, పెద్ద కోట్ల భాస్కర్ ,చందా జయ చంద్ర, తో పాటు తొగట కులస్తులు వందల సంఖ్యలో పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు