Tuesday, January 14, 2025
Homeజిల్లాలునెల్లూరునెల్లూరు అపోలో హాస్పిటల్ లో లంగ్ లైఫ్ స్క్రీనింగ్ పరీక్షలు ప్రారంభం

నెల్లూరు అపోలో హాస్పిటల్ లో లంగ్ లైఫ్ స్క్రీనింగ్ పరీక్షలు ప్రారంభం

డైరెక్టర్ ఆఫ్ మెడికల్ సర్వీసెస్ డాక్టర్ శ్రీరాం సతీష్
విశాలాంధ్ర బ్యూరో నెల్లూరు: ఊపిరితిత్తుల క్యాన్సర్లను ముందుగానే గుర్తించి తద్వారా మరణాల సంఖ్యను తగ్గించడమే లక్ష్యంగా అపోలో హాస్పిటల్స్ గ్రూప్ ముందడుగు వేసిందని అందులో భాగంగా భారత దేశంలో మొట్టమొదటి సారిగా అపోలో హాస్పిటల్స్ లంగ్ లైఫ్ పేరుతో ఊపిరితిత్తుల స్క్రీనింగ్ ప్రోగ్రాంను ప్రారంభించిందని నెల్లూరు అపోలో స్పెషాలిటి హాస్పిటల్ డైరెక్టర్ ఆఫ్ మెడికల్ సర్వీసెస్ డాక్టర్ శ్రీరాం సతీష్ వెల్లడించారు. గురువారం ఆయన నెల్లూరులోని అపోలో హాస్పిటల్ లో వైద్యులతో కలిసి ఊపిరితిత్తుల స్కీనింగ్ పరీక్షలను ప్రారంభించారు. అనంతరం జరిగిన మీడియా సమావేశంలో అపోలో అంకాలజీ సర్జన్ డాక్టర్ మనోభిరామ్, అంకాలజీ ఫిజీషియన్ డాక్టర్ హరిత, పల్మనాలజిస్టులు డాక్టర్ ఉమా మహేష్, డాక్టర్ శ్రావణితో కలిసి డాక్టర్ శ్రీరాం సతీష్ మాట్లాడారు. ఊపిరి తిత్తుల క్యాన్సర్ పై ప్రజలకు అవగాహన కల్పించడమే కాకుండా లంగ్ క్యాన్సర్లను నివారించడానికి భారతదేశంలోనే మొట్ట మొదటి సారిగా అపోలో హాస్పిటల్స్ గ్రూపు లంగ్ లైఫ్ స్క్రీనింగ్ ప్రోగ్రామ్ ను ప్రారంభించిందని తెలిపారు. నెల్లూరు అపోలో స్పెషాలిటీ హాస్పిటల్ లో కూడా స్క్రీనింగ్ ప్రోగ్రామ్ ను ఆరంభించామన్నారు. క్యాన్సర్ వ్యాధులను నివారించే చికిత్సలు అందించడంలో అపోలో హాస్పిటల్ అగ్రగామిగా ఉందని గుర్తు చేశారు. 50 నుండి 80 ఏళ్ల మధ్య వయసు కలిగిన వారు ఎక్కువగా ఊపిరితిత్తుల క్యాన్సర్ బారిన పడే అవకాశం ఉందన్నారు. అలాగే ధూమపానం చేసే వారికి, క్యాన్సర్ వ్యాధులు ఎక్కువగా సోకిన వారి కుటుంబాల్లోని వారికి కూడా ఊపిరితిత్తుల క్యాన్సర్ సోకే అవకాశం ఉందని డాక్టర్ శ్రీరాం సతీష్ పేర్కొన్నారు. అలాంటి వ్యక్తులు క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు చేయించుకోవాలని సూచిస్తూ నెల్లూరు అపోలో హాస్పిటల్ లో అతితక్కువ ఫీజుతోనే పరీక్షలు నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని క్యాన్సర్ నుండి బయటపడాలని విజ్ఞప్తి చేశారు.
అంకాలజీ సర్జన్ డాక్టర్ మనోభిరామ్, అంకాలజీ ఫిజీషియన్ డాక్టర్ హరిత, పల్మనాలజిస్టులు డాక్టర్ ఉమా మహేష్, డాక్టర్ శ్రావణి మాట్లాడుతూ ఊపిరితిత్తుల క్యాన్సర్ ప్రపంచ వ్యాప్తంగా ప్రాణాంతకమైన క్యాన్సర్లలలో ఒకటిగా ఉందని, ముందుగా గుర్తిస్తే నివారణ సాధ్యమని తెలియజేశారు. అపోలో లంగ్ లైఫ్ స్క్రీనింగ్ ప్రోగ్రామ్ ద్వారా ఊపిరితిత్తుల క్యాన్సర్ ప్రమాదాన్ని గుర్తించడమే లక్ష్యంగా పెట్టుకున్నట్లు తద్వారా చికిత్స అందివ్యనున్నట్లు చెప్పారు. క్యాన్సర్ పరిధి తక్కువ మోతాదులో ఉంటే సిటి పరిజ్ఞానం, ఎక్కువ మోతాదులో ఉంటే రేడియేషన్ ఎక్స్ పోజర్ ద్వారా చికిత్స అందించి రోగికి పునర్ జన్మ ప్రసాదించే అవకాశం ఉందని వైద్యులు తెలియజేశారు. నెల్లూరు అపోలో స్పెషాలిటీ హాస్పిటల్ లో అందుబాటులోకి వచ్చిన స్క్రీనింగ్ ప్రోగ్రామ్ ను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.(ఇంపార్టెంట్ తప్పకుండా పట్టాలి )

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు