Homeజిల్లాలుఅనంతపురంసమిష్టి సహకారంతో పట్టణాభివృద్ధికి కృషి చేద్దాం..కందికుంట

సమిష్టి సహకారంతో పట్టణాభివృద్ధికి కృషి చేద్దాం..కందికుంట

- Advertisement -

పట్టణంలో 38 లక్షలతో హైమస్త్‌ లైట్లకి శ్రీకారం
విశాలాంధ్ర,కదిరి: (శ్రీసత్యసాయి).సమిష్టి సహకారంతో పట్టణాభివృద్ధికి కృషి చేద్దామని కదిరి శాసనసభ్యులు కందికుంట వెంకట ప్రసాద్‌ అన్నారు.సోమవారం ఆయన పట్టణంలో రూ.38 లక్షలతో హైమస్త్‌ లైట్లకి శ్రీకారానికి భూమి పూజ చేశారు.అంతే కాకుండా పట్టణంలో సిసి కెమెరాలతో ప్రత్యేక నిఘా ఏర్పాటు కృషి చేస్తున్నట్లు వారు తెలిపారు.ఖాద్రి లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాల సమయంలో తిరువీధులలో విద్యుత్‌ అంతరాయం కలగకుండా అండర్‌ కేబుల్‌ ఏర్పాటు చేస్తున్నామన్నారు.ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే ఎం.ఎస్‌ పార్ధసారథి, ఆర్డీఓ వి.వి ఎస్‌ శర్మ, మున్సిపల్‌ కమిషనర్‌ కిరణ్‌ కుమార్‌ అన్ని శాఖల అధికారులు పాల్గొన్నారు

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు