– విద్యార్దులకు ఉచితంగా వీరమల్లు ప్రత్యేక షో
విశాలాంధ్ర – సీతానగరం/రాజానగరం : పవన్ సినిమా వచ్చిందంటేనే యువతలో ఉత్సాహం కట్టలు తెంచుకుంటుంది,దానికి తోడు విద్యార్దులకు ఉచితంగా ప్రత్యేక షో వేయడం అంటే థియేటర్లు వద్ద పండుగ కోలాహలం నెలకొంటుంది. ఏపీ ఇంచార్జీ సీఎం పవన్ కళ్యాణ్ నటించిన హరి హర వీరమల్లు చిత్రం విడుదలై ఘన విజయం సొంతం చేసుకొంది. నియోజకవర్గంలోని
రాజానగరం, సీతానగరం, కోరుకొండ మూడు మండల కేంద్రాల్లో విడుదలైన హరిహర వీరమల్లు చిత్రాన్ని మూడు మండలాల విద్యార్దులు కోసం నియోజకవర్గ శాసనసభ్యులు బత్తుల బలరామ కృష్ణ ఆధ్వర్యంలో
ఆదివారం ఉదయం ఆట ఉచితంగా ఎర్పాటు చేశారు. దీంతో నియోజకవర్గంలోనీ మూడు థియేటర్లు వద్ద ఉదయం నుండే పండగ వాతావరణం నెలకుంది.
దీనిలో భాగంగా జనసేన నా సేన నా వంతు కో-ఆర్డినేటర్ బత్తుల వెంకటలక్ష్మి నేతృత్వంలో మూడు మండలాల్లో పర్యటించి విద్యార్దులకు సినిమా టికెట్లను ఉచితంగా అందజేశారు.దీనిలో భాగంగా కేకు కోసి సంబరాలు జరుపుకున్నారు.ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ ఉభయ తెలుగు రాష్ట్రాలతో పాటు దేశ వ్యాప్తంగా,ప్రపంచవ్యాప్తంగా విడుదలైన హరిహర వీరమల్లు అఖండ విజయం సాధించడం ఆనందంగా ఉందన్నారు.మన చరిత్రను,భారత దేశ అమరవీరుల చరిత్రను నేటి విద్యార్థులకు తెలియజెప్పాలనే సంకల్పంతో ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలల్లో చదువే విద్యార్ధులకు ప్రత్యేక షో ద్వారా ఉచితంగా చిత్రాన్ని చూపించడం జరిగిందన్నారు.జనసేన నాయకులు, విద్యార్థులతో కలిపి కేక్ కటింగ్ చేసి తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ వ్యాప్తంగా జనసేన నాయకులు, పాల్గొన్నారు.
————————————————————————————————————
One attachment • Scanned by Gmail


