ఈ రోజు ఉదయం 6.0 తీవ్రతతో ప్రకంపనలు
రష్యాను వరుస భూకంపాలు వణికిస్తున్నాయి. ఇటీవల రష్యా కమ్చాట్కా తీరంలో భారీ భూకంపం సంభవించిన సంగతి తెలిసిందే. రిక్టర్ స్కేల్‌పై భూకంప తీవ్రత ఏకంగా 8.8గా నమోదైంది. తాజాగా మంగళవారం ఉదయం అదే కమ్చాట్కా తీరంలో మరోసారి భూకంపం సంభవించింది.మాస్కో: వరుస భూకంపాలు రష్యాను వణికిస్తున్నాయి. ఇటీవల రష్యా కమ్చాట్కా తీరంలో భారీ భూకంపం సంభవించిన సంగతి తెలిసిందే. రిక్టర్ స్కేల్‌పై భూకంప తీవ్రత ఏకంగా 8.8గా నమోదైంది. తాజాగా మంగళవారం ఉదయం అదే కమ్చాట్కా తీరంలో మరోసారి భూకంపం సంభవించింది. ఈసారి భూకంప తీవ్రత 6.0గా నమోదైంది. అయితే ఈ భూకంపం వల్ల కలిగిన ఆస్తి, ప్రాణ నష్టం గురించి పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.
జులై 30వ తేదీన ఇదే తీరంలో భారీ భూకంపం సంభవించింది. ఆ భారీ భూకంపం కారణంగా రష్యా, జపాన్, ఉత్తర పసిఫిక్ తీరంలోని పలు ప్రాంతాలను సునామీ తాకింది. కాగా, ఆ భూకంపం తర్వాత కూడా కమ్చాట్కా తీరంలో భూప్రకంపనలు కొనసాగాయి. 8.8 తీవ్రతతో సంభవించిన భారీ భూకంపం తర్వాతి నుంచి దాదాపు 16 గంటలపాటు రష్యా సమీపంలో 4.4 లేదా అంతకంటే ఎక్కువ తీవ్రతతో దాదాపు 125 సార్లు ప్రకంపనలు నమెదైనట్టు యూఎస్ జియోలాజికల్ సర్వే డేటా ప్రకారం తెలుస్తోంది.
ఆదివారం కూడా కురిల్ దీవులలో 6.7 తీవ్రతతో భూకంపం సంభవించినట్టు నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ ఒక ప్రకటనలో తెలిపింది. అలాగే అదే కమ్చాట్కా ద్వీపకల్పంలోని క్రాషెన్నినికోవ్ అగ్నిపర్వతం శనివారం అర్ధరాత్రి బద్దలైంది. ఇటీవల సంభవించిన భారీ భూకంపం కారణంగా దాదాపు 600 ఏళ్ల తర్వాత తొలిసారి ఈ అగిపర్వతం బద్దలైనట్టు రష్యా అధికారులు వెల్లడించారు. ఈ అగ్నిపర్వతం బద్దలైన కారణంగా దాదాపు ఆరు వేల మీటర్ల మేర బూడిద ఎగిసిపడినట్టు తెలిపారు.


