Homeజిల్లాలుశ్రీ సత్యసాయిశ్రేయస్సు చట్టం ను పరిశీలించిన ఆర్డిఓ మహేష్

శ్రేయస్సు చట్టం ను పరిశీలించిన ఆర్డిఓ మహేష్

- Advertisement -

విశాలాంధ్ర -ధర్మవరం:: పట్టణ పరిధిలోని తల్లిదండ్రులు, వృద్ధుల పోషణ, శ్రేయస్సు చట్టం 2007 కింద దాఖలైన రెండు కేసులను ఆర్డిఓ మహేష్ స్వయంగా పరిశీలించారు. ఈ సందర్భంగా ఆర్డీవో
వృద్ధుల నివాస ప్రాంతాలకు వెళ్లి స్థానికులతో, బాధిత వృద్ధులతో ప్రత్యక్షంగా మాట్లాడారు.
వారు ఎదుర్కొంటున్న సమస్యలు, కుటుంబ సభ్యుల నుంచి అనుభవిస్తున్న వేధింపుల పై విచారణ చేశారు. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చట్టానికి లోబడి ప్రతి వృద్ధుడికి గౌరవప్రదమైన జీవితం కల్పించాలనే లక్ష్యంతో సంక్షేమానికి ప్రాధాన్యత ఇవ్వాలనీ అధికారులకు స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో అధికారులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు