విశాలాంధ్ర ధర్మవరం : సచివాలయాలలో అవకతవకలకు తావు ఇవ్వరాదని ఆర్డిఓ మహేష్ తెలిపారు. ఈ సందర్భంగా వారు మండల పరిధిలోని సీసీ కొత్తకోట సచివాలయాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. అక్కడ పలు రికార్డులను పరిశీలించారు. అనంతరం లబ్ధిదారులతో ప్రత్యక్షంగా మాట్లాడి వారు ఎదుర్కొంటున్న సమస్యలను తెలుసుకోవడం జరిగింది. తదుపరి వారు మాట్లాడుతూ అన్నదాత సుఖీభవ పథకంలో తప్పుడు ఆధార్ లింక్ సమస్యలపై సమీక్ష నిర్వహించడం జరిగిందని తెలిపారు.ఆధార్ లింకింగ్ లో జరిగిన పొరపాటు కారణంగా పొందాల్సిన లబ్ధి అందకపోతున్న విషయాన్ని విచారించడం జరిగిందన్నారు.
వెంటనే తగిన సవరణల కోసం దరఖాస్తు చేయమని మార్గనిర్దేశం చేయడం జరిగిందన్నారు.
అలాగే, సంబంధిత సిబ్బందిని ఆదేశిస్తూ సమస్యను ఈ సాయంత్రం లోపు పరిష్కరించాల్సిందిగా వారు ఆదేశాలు జారీ చేశారు. ఈ రకమైన అవకతవకలు పునరావృతం కాకుండా ప్రతి దరఖాస్తును జాగ్రత్తగా పరిశీలించి నమోదు చేయాలని వారు స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో సచివాలయ ఉద్యోగులు పాల్గొన్నారు.
సచివాలయాలలో అవకతవకలకు తావు ఇవ్వరాదు.. ఆర్డీవో మహేష్
- Advertisement -
RELATED ARTICLES


