Sunday, March 15, 2026
Homeజిల్లాలుఅనంతపురంబాబూ…సింగిల్ డిజిట్ కి పడిపోతావ్ ..

బాబూ…సింగిల్ డిజిట్ కి పడిపోతావ్ ..

- Advertisement -

ఎన్నికల హామీల అమలు చేయకపోతే ఇదేగతి

కళ్యాణదుర్గం లో సిపిఐ జిల్లా కార్యదర్శి జాఫర్ హెచ్చరిక

విశాలాంధ్ర , కళ్యాణదుర్గం 2024 ఎన్నికల్లో కూటమి పార్టీలు ఇచ్చిన వాగ్దానాలు 100 శాతం అమలు చేయకపోతే 2029 లో సింగిల్ డిజిట్ కి పడిపోవడం ఖాయమని సిపిఐ జిల్లా కార్యదర్శి జాఫర్ హెచ్చరించారు. గురువారం కళ్యాణదుర్గం ఎస్ వి ఎస్ ఫంక్షన్ హాల్ లో నియోజకవర్గ సిపిఐ ప్రతినిధుల మహాసభ సీనియర్ కామ్రేడ్ ఓబుళపతి అధ్యక్షతన జరిగింది. ఈ మహాసభకు ముఖ్య అతిథిగా సిపిఐ జిల్లా కార్యదర్శి జాఫర్, సహాయ కార్యదర్శి మల్లికార్జున, జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు సంజీవప్ప హాజరయ్యారు. ఈ సందర్భంగా జాఫర్ మాట్లాడుతూ భారత కమ్యూనిస్టు పార్టీ కళ్యాణదుర్గం నియోజకవర్గం లో అనేక పోరాటాలు చేసి పేదలకు శివాయ జవాబులు అందించిన ఘనత ఉందన్నారు. ఐదు కళ్ళు సదాశివన్, భంగి ఎర్రిస్వామి, పిఎస్ శర్మ, ఎంవి రమణ లాంటి కమ్యూనిస్టు యోదులు ఇక్కడ ఉద్యమాలు నడిపారని గుర్తు చేశారు. కేంద్రంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం మైనారిటీలో ఉందని అలాంటి వారికి ఊతమిచ్చి చంద్రబాబు నాయుడు కాపాడుతున్నాడని మండిపడ్డారు. మైనార్టీలో ఉన్న ప్రభుత్వానికి మద్దతు ఇచ్చిన చంద్రబాబు రైతాంగాన్ని మరిచిపోయి కార్పొరేట్ శక్తులకు వంతు పాడుతున్నారని ఆవేదన చెందారు. గడిచిన ఎన్నికల్లో కూటమిగా ఏర్పడిన మూడు పార్టీలు ఆంధ్రప్రదేశ్లో ప్రజలకు ఇచ్చిన హామీలను 100 శాతం అమలు చేయాలని అలా చేయని పక్షంలో జగన్ పార్టీకి వచ్చిన సీట్లు కూడా రావని సింగల్ డిజిట్ కి పడిపోతారని హెచ్చరించారు. కళ్యాణదుర్గం నియోజకవర్గంలో సాగునీటి వనరులైన కుందుర్పి బ్రాంచ్ కెనాల్, బీటీపీకి సాగునీరు అందించే కాల్వల పనులు పూర్తి చేసి హామీ నిలబెట్టుకోవాలని స్థానిక ఎమ్మెల్యే సురేంద్ర బాబు కు సూచించారు. సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి మల్లికార్జున మాట్లాడుతూ రైతు ప్రభుత్వం అని చెప్పుకుంటూ చంద్రబాబు నాయుడు కనీసం ఎన్నికల హామీ అయిన అన్నదాత సుఖీభవ కు 20వేల రూపాయలు అందించడానికి వాయిదాలు వేస్తున్నారని మండిపడ్డారు. రైతులకు పంట నష్టపరిహారం, పంటల భీమా అందించాలని డిమాండ్ చేశారు. సంజీవప్ప మాట్లాడుతూ కళ్యాణదుర్గం నియోజకవర్గం లో పేదలకు ఇంటి స్థలాలు పక్కా ఇంటి నిర్మాణం చేపట్టే దాకా ఎర్రజెండా పోరాటం చేస్తుందని చెప్పారు. సమావేశంలో కార్యదర్శి నివేదికను కామ్రేడ్ గోపాల్ చదివి వినిపించారు. నియోజకవర్గంలోని ఐదు మండలాలు , కళ్యాణదుర్గం మున్సిపాలిటీ కార్యదర్శులు తమ తమ నివేదికను వినిపించారు. అనంతరం నియోజకవర్గ కమిటీని జిల్లా కార్యదర్శి జాఫర్ ప్రకటించారు. ఈ కార్యక్రమంలో సిపిఐ  జిల్లా నాయకులు సంతోష్ , జాన్సన్ బాబు ,సహాయ కార్యదర్శి నరసింహులు,  బికె గోపాల్ , ఆంజనేయులు, నాగరాజు నాయక్, ఓంకార్, తిమ్మరాయుడు, ఏఐఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షుడు హనుమంత రాయుడు, తదితరులు పాల్గొన్నారు.

నూతన కార్యవర్గం ఎన్నిక

కళ్యాణదుర్గం నియోజకవర్గం సిపిఐ నూతన కార్యవర్గం  ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ విషయాన్ని సిపిఐ జిల్లా కార్యదర్శి జాఫర్ ప్రకటించారు నియోజకవర్గ కార్యదర్శిగా జి గోపాల్ సహాయ కార్యదర్శిగా నరసింహులను ప్రకటించారు. 55 మంది కౌన్సిల్ సభ్యులుగా ప్రతిపాదించారు ఇందులో 48 మంది పేర్లు ప్రకటించారు మరో ఏడుగురి పేర్లు ఖాళీగా ఉంచారు మరో సహాయ కార్యదర్శిని కూడా తర్వాత ప్రకటిస్తామని జిల్లా కార్యదర్శి తెలిపారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు