Sunday, April 12, 2026
Homeజిల్లాలుఅనంతపురంయువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యం...ఇంచార్జ్ జిల్లా కలెక్టర్ శివ్ నారాయణ శర్మ

యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యం…ఇంచార్జ్ జిల్లా కలెక్టర్ శివ్ నారాయణ శర్మ

- Advertisement -

విశాలాంధ్ర – జేఎన్టీయూ ఏ:రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ తో యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించడమే ప్రభుత్వలక్ష్యమని ఇంచార్జ్ జిల్లా కలెక్టర్ రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ చైర్మన్ మరియు డైరెక్టర్ శివ్ నారాయణ శర్మ తెలిపారు. గురువారం అనంతపురం జేఎన్టీయూ లో రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ కేంద్రంలో బోర్డు సమావేశం నిర్వహించి పలు అంశాలపై సమీక్షించారు. హబ్చేపట్టవలసిన పనులపై ముందస్తు ప్రణాళిక రూపొందించేందుకు సలహాలు,సూచనలుఇవ్వవలసిందిగా బోర్డు సభ్యులను కోరారు. ఇన్నోవేషన్ హబ్ , పారిశ్రామిక రంగ అభివృద్ధికి బోర్డ్ డైరెక్టర్లు తగినంతగా సహకరించాలని కోరారు.
అనంతరం అజెండా మేరకు పలు అంశాలను చర్చించి ఆమోదించారు. స్కిల్స్ డెవలప్మెంట్
ఇన్నోవేషన్, స్టార్టప్స్, ఫెసిలిటేషన్ కేంద్రంగా ఈ రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ యువతకు ఎంతగానో దోహద పడనున్నదన్నారు.
ఈ సమావేశంలో అడిషనల్ బోర్డు డైరెక్టర్లు కనకారావు, పి. కె. మురుగన్( జే ఎస్ డబ్ల్యూ) అనంతపురం జేఎన్టీయూ కళాశాల ప్రిన్సిపల్ చెన్నారెడ్డి, కేంద్రీయ విశ్వవిద్యాలయం కివాడే, యోగేష్ ఇందివర్ (భారత్ ఫోర్జ్) నవీన్ శర్మ (రేమండ్) స్కిల్ డెవలప్మెంట్ నోడల్ అధికారి ప్రతాపరెడ్డి, కంపెనీ సెక్రటరీ వెంకటేష్ దబ్బర, జిల్లా పరిశ్రమల శాఖ జనరల్ మేనేజర్ శ్రీనివాస్ యాదవ్, కియా ప్రతినిధి సోమశేఖర్ రెడ్డి పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు