Homeఅంతర్జాతీయంభారత్‌పై సుంకాలతో రష్యాకు దెబ్బ: ట్రంప్‌

భారత్‌పై సుంకాలతో రష్యాకు దెబ్బ: ట్రంప్‌

- Advertisement -

వాషింగ్టన్‌ : భారత్‌పై అమెరికా విధించిన భారీ సుంకాలతో రష్యా ఆర్థిక వ్యవస్థకు పెద్ద దెబ్బ అని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ వ్యాఖ్యానించారు. ఆయన శ్వేతసౌధంలో విలేకరులతో మాట్లాడుతూ అమెరికా విధిస్తున్న వాణిజ్య ఆంక్షలు, అంతర్జాతీయ ఒత్తిళ్లతో రష్యాకు తీవ్ర నష్టం జరుగుతుందని అన్నారు. రష్యా ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా లేదని, ఇప్పటికే అమెరికా విధిస్తున్న వాణిజ్య ఆంక్షలు, అంతర్జాతీయ ఒత్తిళ్లతో మాస్కో ఆర్థిక వ్యవస్థ తీవ్రంగా దెబ్బతిన్నదని చెప్పారు. రష్యా తమ దేశాన్ని తిరిగి నిర్మించుకోవాల్సి వస్తుందనర్నారు. రష్యా నుంచి అత్యధికంగా చమురు కనుగోలు చేసే భారత్‌పై 50 శాతం సుంకాలు విధించాం. ఇది రష్యాకు పెద్ద దెబ్బ’ అని ట్రంప్‌ వ్యాఖ్యానించారు. రష్యా అధ్యక్షుడు పుతిన్‌ అమెరికా పర్యటనకు రానుండటం గౌరవంగా భావిస్తున్నట్లు చెప్పారు. పుతిన్‌తో నిర్మాణాత్మక సంప్రదింపులు జరుగుతాయని ట్రంప్‌ ఆకాంక్షించారు.
చైనాకు మరో 90 రోజుల విరామం
చైనాతో వాణిజ్య ఒప్పందానికి మరో 90 రోజుల విరామాన్ని ట్రంప్‌ ప్రకటించారు. ఎగ్జిక్యూటివ్‌ ఆర్డర్‌పై సంతకం చేశారు. వాణిజ్య ఒప్పందంపై చర్చల గడువును పొడిగించినట్లు చైనా కూడా అధికారికంగా పేర్కొంది. తొలుత విధించిన 90 రోజుల గడువు మంగళవారంతో ముగిసిన నేపథ్యంలో ట్రంప్‌ ఈ నిర్ణయం తీసుకున్నారు. అంతకుముందు రెండు దేశాలు పరస్పరం సుంకాలు (100శాతానికిపైగా) విధించుకున్నాయి. తర్వాత రద్దు చేసుకున్నాయి. ప్రస్తుతం చైనా దిగుమతులపై 30 శాతం సుంకాలను అమెరికా అమలు చేస్తోంది. భారత్‌పై 25 శాతంగా ఉన్న సుంకాన్ని ఈ నెల 27 నుంచి 50శాతానికి పెంచడం విదితమే.ఈ ఏడాది చివర్లో అమెరికా, చైనా అధ్యక్షులు భేటీ జరగనుండగా… తాజా విరామంతో వాణిజ్య ఒప్పందంపై చర్చలకు మార్గం మరింత సుగమం చేసినట్లు తెలుస్తోంది. సుంకాల విషయంలో చైనాతో వ్యవహారం సంక్లిష్టంగా ఉంటుందని అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్‌ అన్నారు. రష్యా నుంచి చమురు కొనుగోళ్లతో ముడి పెట్టలేని అనేక అంశాలు చైనా`అమెరికా సంబంధాలను ప్రభావితం చేస్తాయని తెలిపారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు