కన్జర్వేటివ్ నేతల డిమాండ్
కెనడా ప్రభుత్వానికి లేఖ
ఒట్టావా: ప్రముఖ కమేడియన్, నటుడు కపిల్ శర్మ కేఫ్‌పై రెండు సార్లు జరిగిన దాడితో లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్‌ను ఉగ్రవాద సంస్థగా ప్రకటించాలని కెనడా ప్రభుత్వాన్ని కన్జర్వేటివ్ పార్టీ నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు ఓ లేఖ రాశారు. సామాన్యులను భయభ్రాంతులకు గురిచేస్తున్న ఈ గ్యాంగ్‌పై చర్యలు తీసుకొనే సమయం ఆసన్నమైందని పేర్కొన్నారు. బిష్ణోయ్ గ్యాంగ్ నేర సామ్రాజ్యం విస్తరిస్తోందని, కెనడా పౌరులను దోచుకోవడం, హత్యల్లో ఈ గ్యాంగ్‌కు పాత్ర ఉందని కెనడా ఎంపీ ఫ్రాంక్ కాపుటో ఆరోపించారు. దేశ, విదేశాల్లో హింసకు తామే బాధ్యులమని బిష్ణోయ్ గ్యాంగ్ ప్రకటించుకున్న విషయాన్ని తన లేఖలో ప్రస్తావించారు. ఇలా రాజకీయంగా, మతపరమైన, సైద్ధాంతిక కారణాలతో అనేక అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్న ఆ గ్యాంగ్‌ను ఉగ్రవాద సంస్థల జాబితాలో చేర్చాలని కోరారు. తద్వారా ఆ గ్యాంగు ఆగడాలను కట్టడి చేయొచ్చని, దానిని అణచివేసేందుకు భద్రతా సంస్థలకు అవకాశం ఉంటుందన్నారు. బిష్ణోయ్ గ్యాంగ్ విషయంలో ఇప్పటికే కెనడా నాయకులు అనేక మంది ఆందోళన వ్యక్తం చేసినట్లు ఫ్రాంక్ గుర్తుచేశారు. బ్రాంప్టన్ మేయర్ పాట్రిక్ బ్రౌన్ సహా నలుగురు నేతలు గతంలో ఇలాంటి విజ్ఞప్తి చేశారని, బ్రిటీష్ కొలంబియా ప్రీమియర్ డేవిడ్ ఈబే, అల్బెర్టా ప్రీమియర్ డేనియల్ స్మిత్, సర్రీ మేయర్ బ్రెండా లాకీ కూడా బిష్ణోయ్ గ్యాంగ్‌పై చర్యలను కోరారని వెల్లడిరచారు. బిష్ణోయ్ గ్యాంగ్‌పై చర్యలకు రాజకీయంగా ఏకాభిప్రాయం ఉందని ఎంపీ పేర్కొన్నారు.
బిష్ణోయ్ గ్యాంగ్‌పై ‘ఉగ్ర’ ముద్ర
- Advertisement -
RELATED ARTICLES


