- Advertisement -
విశాలాంధ్ర-చీరాల టౌన్: 79వ స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా ఎమ్మెల్యే కొండయ్య ఆదేశానుసారం చీరాల అధికార ప్రతినిధి మహీంద్రానాథ్ ఆధ్వర్యంలో చీరాల మున్సిపల్ కార్యాలయం నుండి బస్టాండ్ సర్కిల్ మీదుగా గడియార స్తంభం వరకు 79 అడుగుల తిరంగా జండాతో ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో ఆర్డీవో చంద్రశేఖర్,చీరాల మున్సిపల్ చైర్మన్ మించాల సాంబశివరావు, చీరాల ఏఎంసీ చైర్మన్ కౌతురపు జనార్ధన్,మున్సిపల్ కమిషనర్ రషీద్, మున్సిపల్ వైస్ చైర్మన్ పొత్తూరి సుబ్బయ్య, మోప్మా అధికారి కొండయ్య, కౌన్సిలర్లు,విద్యార్థులు, ప్రజలు వందలాదిగా పాల్గొని విజయవంతం చేశారు.


