Homeఆంధ్రప్రదేశ్సందేశాత్మక  చిత్రం "మత్తురా"  సినిమా ఘన విజయం సాధించాలని.. మంత్రి దుర్గేష్

సందేశాత్మక  చిత్రం “మత్తురా”  సినిమా ఘన విజయం సాధించాలని.. మంత్రి దుర్గేష్

- Advertisement -

విశాలాంధ్ర – నిడదవోలు :

సమాజానికి ఉపయోగపడే విధంగా తయారుకావాలని సందేశాత్మకంగా చిత్రీకరించిన “మత్తురా”  సినిమా ఘన విజయం సాధించాలని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ ఆకాంక్షించారు. బుధవారం నిడదవోలులోని క్యాంపు కార్యాలయంలో మంత్రి కందుల దుర్గేష్  శ్రీనిధి ఎంటర్టైన్ మెంట్ బ్యానర్ పై నిర్మించిన “మత్తురా” సినిమా టీజర్ ను రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా మంత్రి దుర్గేష్ మాట్లాడుతూ “మత్తురా” టీజర్ చూడగానే సినిమా చూసేయాలన్న విధంగా చాలా బాగా ఎడిట్ చేశారని ప్రశంసించారు.  ఈ చిత్రం ద్వారా సమాజంలో మార్పు రావాలని కోరుకుంటున్నానన్నారు. ఈ సినిమాను నిర్మించిన నిర్మాత ఎద్దుల రాజారెడ్డి, దర్శకులు పువ్వల చలపతి, సంగీతం బోసం మనోజ్ కుమార్,  అనుదీప్, అజయ్ సందు, సుహానా, వేదిక,అ శ్విని, శ్రీనివాస్, కల్కి తదితర నటీనటులు, పని చేసిన సాంకేతిక నిపుణులు, చిత్ర యూనిట్ కు ఈ సందర్భంగా మంత్రి దుర్గేష్ అభినందనలు తెలిపారు.  అనంతరం చిత్ర బృందం మంత్రి కందుల దుర్గేష్ ను శాలువాతో సత్కరించి వేంకటేశ్వరస్వామి చిత్రపటాన్ని బహుకరించారు. ఈ సందర్భంగా మంత్రి దుర్గేష్ చిత్ర యూనిట్ కు ఆల్ ది బెస్ట్ తెలిపారు. 

ఫొటో ndd 3 మత్తుర సినిమా టీజర్ ను రిలీజ్ చేస్తున్న మంత్రి కందుల దుర్గేష్

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు