— గోకులం నిర్వహణా నిమిత్తం తాడాల చక్రవర్తి 10,116 విరాళం
విశాలాంధ్ర – కడియం : మండల కేంద్రమైన కడియం గ్రామంలో శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు ఘనంగా జరిగాయి. గిరజాల వారి వీధిలో గల రామాలయం కృష్ణాలయం నందు ఆనం ఎలక్ట్రికల్స్ డైరెక్టర్ తుమ్మా తాత నాయుడు సత్యవేణి దంపతులు, మరియు వారి అల్లుడు కుమార్తె కోనాఆహికృష్ణ, శ్రావ్య దంపతులు విశేష పూజలు నిర్వహించారు. అనంతరం భక్తులకు అన్నప్రసాదం ఏర్పాటు చేశారు. అలాగే శ్రీ భ్రమరాంబా సమేత మల్లేశ్వర స్వామి ఆలయ ప్రాంగణంలో గల గోశాలలో జరిగిన శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలలో, గోసంరక్షణ సమితి ఆధ్వర్యంలో పిండి వరహాల నరసింహ మూర్తి వరలక్ష్మి దంపతులు, అనంతపల్లి వీరనారాయణ జగదీశ్వరి దంపతులు పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా వైసీపీ జిల్లా జనరల్ సెక్రెటరీ తాడాల విష్ణు చక్రవర్తి రాజరాజేశ్వరి దంపతులు గోకులం నిర్వహణ నిమిత్తం 10,116 రూపాయలు విరాళంగా అందించారు. చక్రవర్తి దంపతులతో పాటు వైసిపి రాష్ట్ర కార్యదర్శి గిరజాల బాబు రామకృష్ణ తులసి దంపతులు మరియు వారి కుటుంబ సభ్యులు సాయి సుబ్రహ్మణ్య చేతన్, సాయి దుర్గా కుసుమ, అరవింద్ రాజ్ లు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ నిర్వాహకులు, భక్తులతో కలిసి శ్రీకృష్ణుడికి పూజలు చేసి, స్వామివారి ఆశీస్సులు పొందారు. అనంతరం ఉట్టి కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాజీ పార్లమెంట్ సభ్యులు గిరజాల వెంకటస్వామి నాయుడు, గిరజాల నాగేశ్వరరావు, గిరజాల సూర్య ప్రభాకర్ (బాబ్జి), తిరుమల శెట్టి శ్రీనివాస్, గోశాల సంరక్షణ సమితి సభ్యులు పిండి నాగరాజు, పున్నమిరాజు వీర్రాజు, చిలుకూరి రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.


