Homeసినిమావెరైటీగా, అత్యంత పొడవైన టైటిల్‌తో వస్తున్న చంద్ర సిద్ధార్థ్ కొత్త చిత్రం

వెరైటీగా, అత్యంత పొడవైన టైటిల్‌తో వస్తున్న చంద్ర సిద్ధార్థ్ కొత్త చిత్రం

- Advertisement -

“ఈ పాట కోరినవారు నెమలిపాలెం నుండి రమ, జ్యోత్స్న, నందు, మురళి, కబీర్, ఢోల్ రవి మొదలగువారు” తెలుగు సినిమా చరిత్రలోనే అత్యంత పొడవైన టైటిల్‌
“ఆ నలుగురు”, “అందరి బంధువయా” వంటి హృద్యమైన చిత్రాలతో తెలుగు ప్రేక్షకుల్లో తనకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న విలక్షణ దర్శకుడు చంద్ర సిద్ధార్థ్, మరో విభిన్నమైన కథాంశంతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఆయన స్వీయ దర్శకత్వంలో, ఫిల్మోత్సవ్ బ్యానర్‌పై నిర్మించిన తాజా చిత్రం.. ఁఈ పాట కోరినవారు నెమలిపాలెం నుండి రమ, జ్యోత్స్న, నందు, మురళి, కబీర్, ఢోల్ రవి మొదలగువారు. భారతీయ సినీ చరిత్రలోనే అత్యంత పొడవైన టైటిల్‌గా నిలుస్తున్న ఈ సినిమా సెప్టెంబర్ 18న విడుదల కానుంది.ఈ చిత్రం ఒక హై-కాన్సెప్ట్ సైకలాజికల్ మిస్టరీ మ్యూజికల్‌ మూవీగా రూపుదిద్దుకుంది. దివంగత ప్రముఖ రచయిత, దర్శకుడు మదన్ అందించిన కథతో ఈ సినిమాను చంద్ర సిద్ధార్థ్ తెరకెక్కించారు. గతంలో వీరిద్దరి కాంబినేషన్‌లో వచ్చిన “ఆ నలుగురు” క్లాసిక్‌గా నిలిచిన సంగతి తెలిసిందే. సౌండ్ థెరపీ, బ్రెయిన్ మ్యాపింగ్, జ్ఞాపకాలు, అపరాధ భావన వంటి అంశాలను కథలో కీలక మలుపులుగా చూపిస్తూ, సంగీతం-మానవ మెదడు మధ్య ఉన్న సంబంధాన్ని ఆవిష్కరించే ప్రయత్నం చేశారు. ఈ సందర్భంగా దర్శకుడు చంద్ర సిద్ధార్థ్ మాట్లాడుతూ, ఁఈ కథ నా స్నేహితుడైన మదన్‌తో కలిసి చేయాలనుకున్న ప్రాజెక్ట్. ఇది ఆయన చివరిగా ప్లాన్ చేసిన సినిమా. ప్రతిరోజూ రాత్రి 10:30 గంటలకు ఒక రేడియో స్టేషన్ నుంచి ఒకే పాట ప్రసారమవుతుంది. ఆ పాటను నెమలిపాలెం నుంచి కొందరు వ్యక్తులు కోరుతుంటారు. అదే ఈ సినిమా టైటిల్ వెనుక ఉన్న రహస్యం. ధ్వని, న్యూరోసైన్స్, ప్రేమ వంటి అంశాలతో ముడిపడిన ఈ సైకలాజికల్ థ్రిల్లర్ ప్రేక్షకులకు కొత్త అనుభూతిని ఇస్తుంది. ఇది ఒక ప్రయోగాత్మక ప్రయత్నంఁ అని వివరించారు.

ఈ చిత్రంలో హర్ష హీరోగా పరిచయం అవుతుండగా, అమైరా గోస్వామి, సుజనా రెడ్డి, ఇనాయా సుల్తానా, రవివర్మ, అశోక్‌వర్ధన్, రేఖా నిరోషా కీలక పాత్రలు పోషించారు. జే రెక్స్ సంగీతం అందించిన ఈ చిత్రంలో నాలుగు పాటలు ఉన్నాయి. మానవ సంబంధాలను సున్నితంగా ఆవిష్కరించే చంద్ర సిద్ధార్థ్, ఈసారి ఒక ఆధునిక థ్రిల్లర్‌తో ఎలాంటి మ్యాజిక్ చేస్తారోనని సినీ వర్గాల్లో ఆసక్తి నెలకొంది.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు